తెలుగు న్యూస్ / ఫోటో /
Varun Chakravarthy: అశ్విన్ 8 ఏళ్ల కిందటి రికార్డు బ్రేక్ చేసిన వరుణ్ చక్రవర్తి.. మరే ఇతర ఇండియన్ బౌలర్‌కూ లేని రికార్డు
- Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తి ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 2 వికెట్లు తీయడం ద్వారా అతడు 8 ఏళ్ల కిందటి అశ్విన్ రికార్డును తిరగరాశాడు.
- Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తి ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 2 వికెట్లు తీయడం ద్వారా అతడు 8 ఏళ్ల కిందటి అశ్విన్ రికార్డును తిరగరాశాడు.
(1 / 6)
Varun Chakravarthy: టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సౌతాఫ్రికాతో మూడో టీ20లో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్ పేరిట ఉన్న రికార్డును వరుణ్ తిరగరాశాడు.
(2 / 6)
Varun Chakravarthy: సౌతాఫ్రికాతో మూడో టీ20లో వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. దీంతో మొత్తంగా ఇప్పటి వరకూ మూడు టీ20ల్లో కలిపి అతడు 10 వికెట్లు తీశాడు. తొలి టీ20లో మూడు, రెండో టీ20లో ఐదు వికెట్లు తీసిన విషయం తెలిసిందే.
(3 / 6)
Varun Chakravarthy: ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్ లో పది వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. ఈ సిరీస్ లో మరో టీ20 ఇంకా మిగిలే ఉంది.
(4 / 6)
Varun Chakravarthy: ఇంతకుముందు భారత స్పిన్నర్ అశ్విన్ 2016లో శ్రీలంకతో టీ20 సిరీస్ లో 9 వికెట్లు తీశాడు. ఇప్పుడు వరుణ్ ఆ రికార్డును తిరగరాశాడు. గతేడాది రవి బిష్ణోయ్ కూడా ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ లో 9 వికెట్లు తీసుకున్నాడు.
(5 / 6)
Varun Chakravarthy: సౌతాఫ్రికాతో చివరిదైన నాలుగో టీ20 శుక్రవారం(నవంబర్ 15) జరగనుండటంతో వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్ లో తీసే వికెట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు