తెలుగు న్యూస్ / ఫోటో /
Ind vs NZ 1st Test Day 2: ఇక వరుణుడే కాపాడాలి.. టీమిండియా కొంప ముంచిన ఐదు తప్పిదాలు ఇవే
Ind vs NZ 1st Test Day 2: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాను ఇక వరుణుడే కాపాడాలి. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 46 పరుగులకే ఆలౌటై.. తర్వాత న్యూజిలాండ్ కు భారీ స్కోరు ఇస్తుండటంతో ఈ మ్యాచ్ లో ఓడకుండా గట్టెక్కాలంటే వర్షమైనా పడాలి లేదంటే ఏదైనా అద్భుతమైనా జరగాలి.
(1 / 7)
Ind vs NZ 1st Test Day 2: టీమిండియా స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్ లు గెలిచి ఊపు మీద న్యూజిలాండ్ పైబరిలోకి దిగింది. కానీ ఫ్యాన్స్ దిమ్మదిరిగేలా తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోనే కేవలం 46 పరుగులకు కుప్పకూలి పరువు తీశారు. అయితే దీనికి ఈ ఐదు కారణాలు అని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.
(2 / 7)
Ind vs NZ 1st Test Day 2: భారత జట్టు వైఫల్యానికి టాస్ ప్రధాన కారణమని అందరూ అభిప్రాయపడుతున్నారు. నిజానికి టాస్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ బ్యాటింగ్ తీసుకోవడం సగటు అభిమానికి కూడా మింగుడుపడలేదు. కొన్ని రోజులుగా బెంగళూరులో వర్షాలు, తొలి రోజు మొత్తం వర్షం వల్ల తుడిచిపెట్టుకుపోవడం, రెండోరోజు కూడా ఆకాశం మేఘావృతమైన వేళ మొదట బ్యాటింగ్ సూసైడ్ లాంటిదే. అలాంటి అతి పెద్ద తప్పు రోహిత్ చేశాడు.
(3 / 7)
Ind vs NZ 1st Test Day 2: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం చూస్తుంటే గంభీర్, రోహిత్ శర్మ పిచ్ ను చదవడంలో ఎంతలా విఫలమయ్యారన్నది స్పష్టంగా అర్థమవుతోంది.
(4 / 7)
Ind vs NZ 1st Test Day 2: ఈ మ్యాచ్ కు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగారు. ఇలాంటి పిచ్ పై ఇరగదీసే అవకాశం ఉన్నా.. ఆకాశ్ దీప్ ను పక్కన పెట్టడం కూడా హెడ్ కోచ్, కెప్టెన్ల తప్పిదాన్ని సూచిస్తోంది. న్యూజిలాండ్ పేస్ బౌలర్లు చెలరేగిన తీరే దీనికి నిదర్శనం.
(5 / 7)
Ind vs NZ 1st Test Day 2: గాయం కారణంగా గిల్ దూరం కావడంతో చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లిని మూడో స్థానంలో దింపారు. ఇది కూడా టీమ్ కొంప ముంచింది. ఫామ్ కోసం తంటాలు పడుతున్న విరాట్.. ఓవర్ కాస్ట్ కండిషన్స్ లో బంతి అటూఇటూ కదులుతున్న వేళ ఆడటం అంత సులువు కాదు. కోహ్లి డకౌట్ అదే నిరూపించింది.(PTI)
(6 / 7)
Ind vs NZ 1st Test Day 2: న్యూజిలాండ్ పేస్ బౌలర్లను అలాంటి కండిషన్స్ లో భారత బ్యాటర్లు తక్కువ అంచనా వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కొందరి షాట్ సెలక్షన్ కూడా ఆశ్చర్యపరిచింది. కనీసం తొలి గంట సేపయినా కాస్త ఓపిగ్గా ఆడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. బెంగళూరులో మధ్యాహ్నానికి మంచి ఎండ రావడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగారు.
ఇతర గ్యాలరీలు