తెలుగు న్యూస్ / ఫోటో /
Volkswagen Taigun: వోక్స్ వేగన్ టైగున్ లైనప్ లో కొత్తగా సౌండ్ ఎడిషన్; ఇవే స్పెషాలిటీస్..
- Volkswagen Taigun Sound Edition: ఇప్పటికే GT ఎడ్జ్ ట్రైల్ ఎడిషన్, GT ఎడ్జ్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌లను వోక్స్ వేగన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇప్పుడు తాజాగా, వోక్స్‌వ్యాగన్ టైగన్ సౌండ్ ఎడిషన్ (Volkswagen Taigun Sound Edition) ను టైగున్ లైనప్ లో యాడ్ చేస్తోంది.
- Volkswagen Taigun Sound Edition: ఇప్పటికే GT ఎడ్జ్ ట్రైల్ ఎడిషన్, GT ఎడ్జ్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌లను వోక్స్ వేగన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇప్పుడు తాజాగా, వోక్స్‌వ్యాగన్ టైగన్ సౌండ్ ఎడిషన్ (Volkswagen Taigun Sound Edition) ను టైగున్ లైనప్ లో యాడ్ చేస్తోంది.
(1 / 6)
వోక్స్‌వ్యాగన్ జర్మనీకి చెందిన సంస్థ. భారత్ లో తన టైగన్ లైనప్ లో కొత్తగా సౌండ్ ఎడిషన్ ను యాడ్ చేస్తోంది. ఇది టైగన్ SUV యొక్క ప్రత్యేక ఎడిషన్ మోడల్, వోక్స్ వేగన్ గతంలో GT ఎడ్జ్ ట్రైల్ ఎడిషన్, GT ఎడ్జ్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌లను విడుదల చేసింది.
(2 / 6)
వోక్స్‌వ్యాగన్ టైగన్ సౌండ్ ఎడిషన్ నాలుగు రంగులలో లభిస్తుంది: అవి కార్బన్ స్టీల్ గ్రే, లావా రెడ్, రైజింగ్ బ్లూ, వైల్డ్ చెర్రీ రెడ్, ఈ ఎస్యూవీ లోని C-పిల్లర్‌లపై గ్రాఫిక్స్‌తో పాటు ‘సౌండ్ ఎడిషన్’ అనే బ్యాడ్జింగ్ ఆకర్షణీయంగా ఉంటుంది.
(3 / 6)
క్యాబిన్ లోపల, ఇంటీరియర్ డిజైన్ లో కీలక అప్‌డేట్‌లు చేశారు, స్టాండర్డ్ మోడల్స్ కన్నా ఇది వేరుగా ఉంటుంది. ఇందులో స్టాండర్డ్ ఫీచర్లతో పాటు, పవర్డ్ ఫ్రంట్-వరుస సీట్లు ఉంటాయి. అలాగే, సబ్-వూఫర్, యాంప్లిఫైయర్‌తో ఏడు-స్పీకర్ల సెటప్ ప్రత్యేకంగా ఉంటుంది.
(4 / 6)
వోక్స్‌వ్యాగన్ టైగన్ సౌండ్ ఎడిషన్ తో పాటు వోక్స్‌వ్యాగన్ వర్టస్ స్పెషల్ ఎడిషన్ లను ఒకేసారి విడుదల చేశారు. Virtus ప్రత్యేక ఎడిషన్ అవతార్‌కు Virtus సౌండ్ ఎడిషన్ అని నామకరణం చేశారు. వర్టస్ సౌండ్ ఎడిషన్ ధర రూ. 15.52 లక్షల నుంచి రూ. 16.77 లక్షల (ఎక్స్-షోరూమ్)వరకు ఉంటుంది.
(5 / 6)
వోక్స్‌వ్యాగన్ టైగన్ మార్కెట్లో హోండా ఎలివేట్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్ వంటి SUVలకు ప్రత్యర్థిగా ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ తో మార్కెట్ షేరును మరింత పెంచుకోవాలని వోక్స్ వేగన్ భావిస్తోంది.
ఇతర గ్యాలరీలు