తెలుగు న్యూస్ / ఫోటో /
Maruti Suzuki Invicto: ఘనంగా మారుతి సుజుకీ ఎంపీవీ ‘ఇన్విక్టో’ లాంచ్
- Maruti Suzuki Invicto: మల్టీ పర్పస్ వెహికిల్ ఇన్విక్టో(Invicto) ను మారుతి సుజుకీ బుధవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కారు ఎక్స్ షో రూమ్ ధర వేరియంట్ ను బట్టి రూ. 24.79 లక్షల నుంచి రూ. 28.42 లక్షల మధ్య ఉంది.
- Maruti Suzuki Invicto: మల్టీ పర్పస్ వెహికిల్ ఇన్విక్టో(Invicto) ను మారుతి సుజుకీ బుధవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కారు ఎక్స్ షో రూమ్ ధర వేరియంట్ ను బట్టి రూ. 24.79 లక్షల నుంచి రూ. 28.42 లక్షల మధ్య ఉంది.
(1 / 8)
ఇన్విక్టోను మారుతి సుజుకీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందించింది. అంతేకాదు, మారుతి సుజుకీ నుంచి వచ్చిన అత్యంత ఖరీదైన కారు కూడా ఇదే. ఈ కారు హై ఎండ్ మోడల్ ధర రూ. 28.42 లక్షల వరకు ఉంది.
(2 / 8)
ఈ మారుతి సుజుకీ ప్రీమియం ఎంపీవీ ఇన్విక్టో ని రూ. రూ. 24.79 లక్షల నుంచి రూ. 28.42 లక్షల ధరల శ్రేణిలో లాంచ్ చేశారు. ఈ కారు సెవెన్ సీట్స్, 8 సీట్స్ ఆప్షన్స్ తో వస్తోంది. భారత్ లో నెక్సా షో రూమ్స్ ద్వారా ఈ కారు అమ్మకాలు జరుగుతాయి.
(3 / 8)
ఈ ఇన్విక్టోలో అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ప్రీమియం క్వాలిటీ క్యాబిన్ ను ఏర్పాటు చేశారు. ఇందులో 7 ఇంచ్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 10 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ క్లస్టర్ ఉన్నాయి. పానొరమిక్ సన్ రూఫ్ ఉంది. మధ్య వరుస సీట్లు రిక్లైనింగ్ స్టైల్లో ఉంటాయి. 6 స్పీకర్ ఆడియో సిస్టమ్ ఉంది.
(5 / 8)
ఈ ఇన్వెక్టోలో బెటర్ సేఫ్టీ కోసం ఇన్ఫోటైన్ మెంట్ డిస్ ప్లే లో సరౌండ్ చెకింగ్ వ్యూ సదుపాయం ఉంది. ప్రీమియం రేంజ్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఎంపీవీని డిజైన్ చేసినట్లు కంపెనీ చెబుతోంది.
(6 / 8)
ఈ ఎంపీవీలో క్యాబిన్ స్పేస్ చాలా ఉంది. ముందు కూర్చున్నవారు, అలాగే, వెనుక కూర్చున్నవారు సౌకర్యంగా కూర్చునేలా క్యాబిన్ స్పేస్ ను వదిలారు. బ్లాక్, బీజ్ కలర్స్ లో ఇంటీరియర్స్ ను, సీట్స్ ను రూపొందించారు.
(7 / 8)
ఈ మారుతి సుజుకీ ఇన్విక్టో లో హైబ్రిడ్ టెక్నాలజీతో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను అమర్చారు. ఇది గరిష్టంగా 183 బీహెచ్పీ పవర్ ను, 250 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఈ సీవీటీ గేర్ బాక్స్ ను అమర్చారు. ఈ ఎంపీవీలో నార్మల్, స్పోర్ట్, ఎకో డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. ఇది జీరో నుంచి 100 కిమీల వేగాన్ని 9.5 సెకండ్లలో చేరుతుంది. మైలేజీ కూడా లీటరుకు 23.24 కిమీలు ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
ఇతర గ్యాలరీలు