Property Purchase: స్థిరాస్తి కొంటున్నారా, ఈ జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి… లేకపోతే నష్టపోతారు…!
- Property Purchase: స్థిరాస్తి కొనుగోలు కనీస జాగ్రత్తలు పాటించకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చు. వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, ఇల్లు, ఫ్లాట్ వంటి ఆస్తుల హక్కుల నిర్థారణ అంత సులువైన విషయమేమి కాదు.న్యాయపరమైన చిక్కులు లేని హక్కులు ఉన్న ఆస్తులను మాత్రమే కొనుగోలు చేయకపోతే నష్టపోవాల్సి రావొచ్చు.
- Property Purchase: స్థిరాస్తి కొనుగోలు కనీస జాగ్రత్తలు పాటించకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చు. వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, ఇల్లు, ఫ్లాట్ వంటి ఆస్తుల హక్కుల నిర్థారణ అంత సులువైన విషయమేమి కాదు.న్యాయపరమైన చిక్కులు లేని హక్కులు ఉన్న ఆస్తులను మాత్రమే కొనుగోలు చేయకపోతే నష్టపోవాల్సి రావొచ్చు.
(1 / 11)
స్థిరాస్తులు చాలా రకాలు ఉంటాయి. అందులో అమ్మవారికి ఉన్న హక్కుల విషయంలో మొదట స్పష్టత తీసుకోవాల్సి ఉంటుంది. సంపూర్ణ హక్కులు ఉన్న స్థిరాస్తులు, పరిమిత హక్కులున్న స్థిరాస్తులు ఉంటాయి. పరిపూర్ణ హక్కులు ఉన్న యజమాని నుంచి మాత్రమే ఆస్తులను విక్రయించే హక్కులు ఉంటాయి.
(2 / 11)
పరిమిత హక్కులతో ఆస్తి వ్యవహారాలను నిర్వహించే వారికి ఆస్తిని బదిలీ చేసే హక్కులు దాఖలు పడవు. ఆస్తి యాజమాన్య బదిలీలో ఆస్తి హక్కులను ధృవీకరించుకున్న తర్వాతే కొనుగోలుకు సిద్ధపడాలి.
(3 / 11)
కొనుగోలు చేయబొోయే ఆస్తులపై ఎలాంటి న్యాయ వివాదాలు లేవని ధృవీకరించుకోవాలి. గతంలో ఎవరితో అయినా అమ్మకం ఒప్పందాలు లేవని స్పష్టం చేసుకోవాలి. రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకుని ఉంటే కొనుగోలు చేసే భూమిలో ఆ మేరకు మినహాయింపు కోరాలి.
(4 / 11)
ఆస్తులను కొనుగోలు చేసే సమయంలో వాటికి సంబంధించిన పన్నుల చెల్లింపులు, బకాయిలపై స్పష్టత తీసుకోవాలి. పాతబాకీలను అమ్మకందారుడే చెల్లించేలా జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్న వారు భారీగా పన్నులు చెల్లించాల్సి రావొచ్చు.
(5 / 11)
అపార్ట్‌మెంట్‌ల కొనుగోలు విషయంలో స్థలం డాక్యుమెంట్లతో పాటు దాని అసలు ప్లాన్ కూడా పరిశీలించాలి. అనుమతులు లేని ఫ్లోర్ల విషయంలో కూడా మోసపోయే అవకాశం ఉంటుంది. కనీసం 15ఏళ్లకు సంబంధించిన ఈసీలను తీసుకుంటే వాటిపై పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
(6 / 11)
ఆస్తులను కొనుగోలు చేసే సమయంలో వాటిపై ఉన్న ఒరిజినల్ పత్రాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ప్రతి డాక్యుమెంట్‌కు లింక్ డాక్యుమెంట్లను పరిశీలించుకోవాలి. ఒక భూమి ఎన్ని చేతులు మారినా, దాని ఒరిజినల్ లింక్ డాక్యుమెంట్‌లో వాస్తవ భూమి వివరాలతో మిగిలిన క్రయ విక్రయాలను పరిశీలించుకోవాలి.
(7 / 11)
కొనుగోలు చేసే స్థలం, ఇల్లు, ఫ్లాట్‌పై ఉన్న లావాదేవీలను ధృవీకరించుకోడానికి సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలి. కొనుగోలు చేసే సేల్ డీడ్ ఒరిజినల్ పత్రాలను పూర్తిగా సొంతంగా పరిశీలించుకున్న తర్వాతే అడ్వాన్స్‌లు చెల్లించాలి.
(8 / 11)
కొనుగోలు చేసే భూమిపై ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఇబ్బందులు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. దీని కోసం ప్రభుత్వ రికార్డులు, మున్సిపల్ రికార్డులు, టౌన్ సర్వే రికార్డులు, పట్టణ భూపరిమితి రికార్డులు, కౌలు రక్షణ రికార్డులను పరిశీలించి, ప్రభుత్వ అభ్యంతరాలు లేవని ధృవీకరించుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి. రెవిన్యూ కార్యాలయంలో పహాణీలలో యాజమాన్య ధృవీకరణలు చేసుకుని పట్టా ఎవరి పేరిట ఉందో నిర్ధారించుకోవాలి.
(9 / 11)
కొనుగోలు చేసే ఆస్తి అమ్మే వ్యక్తి ఆధీనంలోనే ఉందని ధృవీకరించుకున్న తర్వాత, దానిని అమ్మే హక్కు ఉందని నిర్ధారించుకున్న తర్వాతే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఏ స్తిరాస్థి అయినా 12 ఏళ్ల పాటు ఆక్రమణలో ఉంటే దానిపై న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అమ్మే వ్యక్తి ఆధీనంలో ఆస్తి ఉండటాన్ని నిర్థారించుకోవాలి.
(10 / 11)
కొనుగోలు చేసే ఇల్లు, భూమి, ఫ్లాట్, వ్యవసాయ భూమి వివరాలు టైటిల్ డీడ్‌లో రాసిన విధంగా భౌతికంగా ఉందని నిర్థారించుకోవాలి. వాస్తవ హద్దులను ఇరుగు, పొరుగు వారితో నిర్ధారించుకున్న తర్వాత నాలుగు వైపులా కొలతలను ధృవీకరించుకోవాలి.
ఇతర గ్యాలరీలు