తెలుగు న్యూస్ / ఫోటో /
ICC T20I Rankings: టీ20 ర్యాంకుల్లో టీమిండియా ప్లేయర్స్ హవా.. టాప్ 10లో ముగ్గురు
- ICC T20I Rankings: తాజా టీ20 ర్యాంకుల్లో టీమిండియా ప్లేయర్స్ సత్తా చాటారు. జింబాబ్వేతో టీ20 సిరీస్ గెలిచిన తర్వాత ఏకంగా ముగ్గురు ఇండియన్ బ్యాటర్లు టాప్ 10లో చోటు సంపాదించడం విశేషం.
- ICC T20I Rankings: తాజా టీ20 ర్యాంకుల్లో టీమిండియా ప్లేయర్స్ సత్తా చాటారు. జింబాబ్వేతో టీ20 సిరీస్ గెలిచిన తర్వాత ఏకంగా ముగ్గురు ఇండియన్ బ్యాటర్లు టాప్ 10లో చోటు సంపాదించడం విశేషం.
(1 / 6)
ICC T20I Rankings: టీ20 వరల్డ్ ఛాంపియన్స్ టీమిండియా.. జింబాబ్వేలోనూ 4-1తో సిరీస్ గెలిచిన విషయం తెలుసు కదా. తొలి మ్యాచ్ ఓడిన తర్వాత పుంజుకొని వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచింది. ఈ సిరీస్ లో రాణించిన యశస్వి, రుతురాజ్ లాంటి వాళ్లు టీ20 ర్యాంకుల్లో మెరుగయ్యారు.
(2 / 6)
ICC T20I Rankings: టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ తాజా ర్యాంకుల్లో ఏకంగా ఆరో స్థానానికి దూసుకు రావడం విశేషం. అతడు ఈ సిరీస్ లో 141 రన్స్ చేశాడు. మూడు మ్యాచ్ లు ఆడిన అతడు 70.5 సగటుతో పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ ఉండగా.. అత్యధిక స్కోరు 93 నాటౌట్. ఈ ప్రదర్శనతో అతడు నాలుగు స్థానాలు ఎగబాకాడు.
(3 / 6)
ICC T20I Rankings: మొత్తంగా తాజా ర్యాంకుల్లో టాప్ 10లో ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. యశస్వి కాకుండా రుతురాజ్ గైక్వాడ్ కూడా 8వ ర్యాంకులో ఉన్నాడు. నిజానికి అతడు ఏడో స్థానంలో ఉన్నా.. యశస్వి పైకి దూసుకురావడంతో ఒక స్థానం కిందికి దిగజారాడు.
(4 / 6)
ICC T20I Rankings: జింబాబ్వే పర్యటనలో టీమిండియా కెప్టెన్ గా ఉన్న శుభ్‌మన్ గిల్ కూడా 5 మ్యాచ్ లలో 170 రన్స్ చేశాడు. దీంతో తాజా ర్యాంకుల్లో అతడు 36 స్థానాలు ఎగబాకి 37వ ర్యాంకుకు చేరుకున్నాడు. రింకు సింగ్ 46, శివమ్ దూబె 73 ర్యాంకుల్లో ఉన్నారు.
(5 / 6)
ICC T20I Rankings: ఇఖ బౌలర్ల విషయానికి వస్తే జింబాబ్వే సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచిన స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ తాజా ర్యాంకుల్లో 36 స్థానాలు ఎగబాకి 46వ ర్యాంకుకు చేరుకున్నాడు. అయితే టాప్ 10లో మాత్రం ఏ ఇండియన్ బౌలర్ లేడు. అక్షర్ పటేల్ టాప్ 10లో నుంచి బయటకు వెళ్లిపోయాడు.
ఇతర గ్యాలరీలు