తెలుగు న్యూస్ / ఫోటో /
Hyderabad Metro : ప్రయాణికులకు మెట్రో షాక్ - 10 శాతం రాయితీ ఎత్తివేత, రూ.59 హాలిడే కార్డు కూడా రద్దు..!
- Hyderabad Metro Latest News: ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ మెట్రో. కార్డుపై ఇస్తున్న పది శాతం రాయితీని ఎత్తివేయటంతో పాటు రూ.59 హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి….
- Hyderabad Metro Latest News: ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్ మెట్రో. కార్డుపై ఇస్తున్న పది శాతం రాయితీని ఎత్తివేయటంతో పాటు రూ.59 హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి….
(1 / 5)
ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చింది హైదరాబాద్ మెట్రో. మెట్రో కార్డ్ పై ఉన్న 10 శాతం రాయితీని పూర్తిగా ఎత్తివేసింది.(Photo Source www.ltmetro.com/)
(2 / 5)
హాలిడే కార్డులను కూడా రద్దు చేసింది హైదరాబాద్ మెట్రో. వేసవిలో ప్రయాణికులు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.(Photo Source www.ltmetro.com/)
(3 / 5)
గతంలో సెలవు దినాల్లో రూ. 59 రూపాయలతో రోజంతా ప్రయాణించే విదంగా హాలిడే కార్డును తీసుకొచ్చింది హైదరాబాద్ మెట్రో. అయితే ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ పెరగటంతో ఈ కార్డును ఎత్తివేసింది. (Photo Source www.ltmetro.com/)
(4 / 5)
ఈ హాలీడే కార్డు…. ఆదివారం, రెండో శనివారంతో పాటు ఇతర సెలవు రోజుల్లో ఇది అందుబాటులో ఉండేది. పని దినాల్లో మాత్రమే పని చేసింది. ప్రస్తుతం ఈ కార్డును మెట్రో పూర్తిగా రద్దు చేసేసింది. మార్చి 31వ తేదీతోనే ఆపివేసినట్లు తెలిసింది.(Photo Source www.ltmetro.com/)
(5 / 5)
సాధారణ రోజుల్లో ఉండే మెట్రో కార్డు కొంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు.. రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి వరకు ఇచ్చే 10 శాతం రాయితీని సైతం ఎత్తివేసింది. ఈ వేసవిలో చాలా మంది ప్రయాణికులు… మెట్రోలోనే వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రద్దీ విపరీతంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్లను రద్దు చేసినట్లు తెలిసింది. గతేడాది సమ్మర్ టైంలో కూడా కొన్ని ఆఫర్లను రద్దు చేసింది మెట్రో. (Photo Source www.ltmetro.com/)
ఇతర గ్యాలరీలు