తెలుగు న్యూస్ / ఫోటో /
T20 World Cup Winners: పొట్టి సమరంలో గట్టి విజేతలు.. ఇప్పటి వరకు గెలిచిన జట్లు ఇవే..!
- T20 World Cup Winners: ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ సిరీస్‌లు 7 సార్లు జరగ్గా.. ఆరు జట్లు ట్రోఫీని ముద్దాడాయి. 2007లో ఆరంభంమైన ఈ సమరంలో తొలి విజేతగా టీమిండియా నిలవగా.. గతేడాది జరిగిన పోరులో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. వెస్టిండీస్ రెండు సార్లు కప్పు గెలవగా.. భారత్, పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా ఒక్కోసారి విజేతగా నిలిచాయి. ఆస్ట్రేలియా వేదికగా 2022 టీ20 వరల్డ్ కప్ అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు జరగనుంది.
- T20 World Cup Winners: ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ సిరీస్‌లు 7 సార్లు జరగ్గా.. ఆరు జట్లు ట్రోఫీని ముద్దాడాయి. 2007లో ఆరంభంమైన ఈ సమరంలో తొలి విజేతగా టీమిండియా నిలవగా.. గతేడాది జరిగిన పోరులో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. వెస్టిండీస్ రెండు సార్లు కప్పు గెలవగా.. భారత్, పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా ఒక్కోసారి విజేతగా నిలిచాయి. ఆస్ట్రేలియా వేదికగా 2022 టీ20 వరల్డ్ కప్ అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు జరగనుంది.
(1 / 7)
2007లో తొలిసారిగా టీ20 ప్రపంచకప్ సమరం జరగ్గా.. అరంగేట్ర సీజన్‌లోనే అదిరిపోయే విజయాలను అందుకుని టైటిల్ నెగ్గింది టీమిండియా. ధోనీ సారథ్యంలో యువ భారత్ అద్భుతమే చేసింది. ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించి పొట్టి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. 2014లో జరిగిన వరల్డ్ కప్‌లో ఫైనల్‌లో శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది భారత్.(Twitter)
(2 / 7)
2009 జరిగిన రెండో సీజన్‌లో పాకిస్థాన్ వరుసగా రెండో సారి ఫైనల్ కు చేరింది. శ్రీలంకను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. పాక్ జట్టుకు యూనీస్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
(3 / 7)
మూడో టీ20 ప్రపంచకప్ 2010లో జరిగింది. 2011లో జరగాల్సి ఉండగా.. అప్పుడు వన్డే వరల్డ్ కప్ ఉన్న కారణంగా ముందు నిర్వహించారు. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఓ సారి ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడింటి ట్రోఫీని గెలుచుకుని తొలి ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది.
(4 / 7)
నాలుగో టీ20 వరల్డ్ కప్‌ను వెస్టిండీస్ కైవసం చేసుకుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో విండీస్ విజయకేతనం ఎగురవేసింది. వన్డే ప్రపంచకప్ ఆరంభంలో రెండు సార్లు వరుసగా విజయం సాధించిన విండీస్.. ఆ తర్వాత ఐసీసీ సిరీస్‌ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ చివరకు టీ20 ఈ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆసియా గడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో తొలిసారి ఆసియేతర జట్టు వరల్డ్ కప్ గెలిచింది.
(5 / 7)
ఆసియా గడ్డపై రెండో సారి ఐదో టీ20 ప్రపంచకప్ సిరీస్ జరిగింది. 2014లో జరిగిన ఈ సిరీస్‌లో భారత్‌ను ఓడించి శ్రీలంక విజయాన్ని కైవసం చేసుకుంది. 2007లో 50 ఓవర్ల ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన శ్రీలంక ఈ సారి విజేతగా నిలిచింది. ఆసియా గడ్డపై రెండో సారి ఐదో టీ20 ప్రపంచకప్ సిరీస్ జరిగింది. 2014లో జరిగిన ఈ సిరీస్‌లో భారత్‌ను ఓడించి శ్రీలంక విజయాన్ని కైవసం చేసుకుంది. 2007లో 50 ఓవర్ల ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన శ్రీలంక.. అనంతరం 2009, 2011, 2012లోనూ పరాజయమే ఎదురైంది. కానీ చివరకు 2014లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. నాలుగు సార్లు ఫైనల్ ఆడిన తర్వాత వరల్డ్ కప్‌ను ముద్దాడింది. 2007లో విజయం సాధించిన భారత్.. 7 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరి ఓటమిపాలైంది.
(6 / 7)
2016లో మూడోసారి టీ20 ప్రపంచకప్ ఆసియా గడ్డపై జరిగింది. ఈ సిరీస్‌లో వెస్టిండీస్-ఇంగ్లాండ్ జట్లు ఫైనల్లో తలపడగా.. కరేబియన్ జట్టు విజయం సాధించింది. అప్పటివరకు ఎన్నడూ ప్రపంచకప్ గెలవని జట్లు ఫైనల్లో తలపడగా.. ఈ టోర్నీలో మాత్రం తొలిసారిగా టైటిల్‌ను గెలిచిన జట్లు పోటీ పడ్డాయి. అయితే చివరకు విజయం విండీస్‌నే వరించింది.
ఇతర గ్యాలరీలు