తెలుగు న్యూస్ / ఫోటో /
Eating Onion in Winter : చలికాలంలో ఉల్లిపాయ తింటున్నారా? అయితే ఇది మీకోసమే..
- Eating Onion in Winter : చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కొన్ని ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటిల్లో ఉల్లిపాయ కూడా ఒకటి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని ఊరికే అనరు. దాని ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా ఒప్పుకుంటారు.ఇంతకీ చలికాలంలో ఉల్లి చేసే మేలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

(1 / 7)
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు కొన్ని ఫుడ్స్ తినాలని ఆహార నిపుణులు సూచిస్తారు. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉల్లిపాయ. ఇవి ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. అంతేకాకుండా ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.
(2 / 7)
చలికాలంలో ఉల్లిపాయను తీసుకుంటే.. అది మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది. పురాతన చైనీస్ వైద్యంలో కూడా ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించేవారు. అంతేకాకుండా ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
(3 / 7)
సీజనల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఉల్లిపాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే చలికాలంలో ఉల్లిపాయల వినియోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జలుబు, దగ్గు, చెవినొప్పి, జ్వరం, చర్మ సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.
(5 / 7)
పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందట. 2008, 2014లో నిర్వహించిన అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఈ అధ్యయనాలు తేల్చాయి.
(6 / 7)
మెరుగైన జీర్ణక్రియ, బరువు తగ్గడంలో ఉల్లిపాయ ప్రధానపాత్ర పోషిస్తుంది. దీనిలోని ఫైబర్, ప్రీ-బయోటిక్స్ నిండుగా కలిగి ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యానికి అవసరమైనవి. బలమైన ఎముకలకు, శరీరంలో కాల్షియం శోషణను మెరుగుపరచడానికి ఇవి సహాయం చేస్తాయని నిపుణులు చెప్తున్నారు.
ఇతర గ్యాలరీలు