Tollywood: విల్లు ఎక్కుపెట్టిన పవన్ - శ్రీలీలతో నితిన్ స్టెప్పులు - దసరా పోస్టర్స్ వచ్చేశాయ్!
Tollywood: దసరా వేళ కొత్త పోస్టర్లు, అనౌన్స్‌మెంట్స్, టీజర్స్‌తో సినీ అభిమానులకు అసలైన పండుగ ఆనందాన్ని అందించారు దర్శకనిర్మాతలు. విజయదశమి సందర్భంగా విశ్వంభర టీజర్ రిలీజ్ కాగా...పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నుంచి సర్‌ప్రైజ్ వచ్చింది.
(1 / 5)
దసరా కానుకగా హరిహరవీరమల్లు నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ కొత్త పోస్టర్‌లో విల్లు ఎక్కుపెట్టి యోధుడిగా పవన్ కనిపిస్తున్నాడు.
(2 / 5)
రాబిన్ హుడ్ నుంచి నితిన్, శ్రీలీల కొత్త పోస్టర్ వచ్చేసింది. డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు.
(3 / 5)
సిద్దు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జాక్ మూవీ పోస్టర్ శనివారం రిలీజైంది. ఈ పోస్టర్‌లో సిద్ధు జొన్నలగడ్డ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తోన్నాడు.
(4 / 5)
తేజ సజ్జా మిరాయ్ మూవీ దసరా పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మిరాయ్ మూవీకి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తోన్నాడు
ఇతర గ్యాలరీలు