తెలుగు న్యూస్ / ఫోటో /
Happy Birthday Suryakumar Yadav: హ్యాపీ బర్త్ డే సూర్యకుమార్.. తొలి చూపులోనే ప్రేమలో పడిన అతని లవ్ స్టోరీ తెలుసా?
- Happy Birthday Suryakumar Yadav: హ్యాపీ బర్త్ డే సూర్యకుమార్ యాదవ్. గురువారం (సెప్టెంబర్ 14) తన 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ టీమిండియా క్రికెటర్ లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా. అలాంటిదే ఇది కూడా.
- Happy Birthday Suryakumar Yadav: హ్యాపీ బర్త్ డే సూర్యకుమార్ యాదవ్. గురువారం (సెప్టెంబర్ 14) తన 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ టీమిండియా క్రికెటర్ లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా. అలాంటిదే ఇది కూడా.
(1 / 10)
Happy Birthday Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ గురువారం (సెప్టెంబర్ 14) తన 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ గా పేరుగాంచిన ఈ విధ్వంసకర బ్యాటర్ ప్రస్తుతం ఆసియా కప్ కోసం టీమిండియాతో ఉన్న విషయం తెలిసిందే.
(2 / 10)
Happy Birthday Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్ లో నంబర్ వన్ బ్యాటర్ గా ఉన్నాడు. గతేడాది ఇండియన్ టీమ్ తరఫున చెలరేగి ఆడిన సూర్య.. వన్డేల్లో మాత్రం అంతగా ప్రభావం చూపకపోయినా ఆసియా కప్, వరల్డ్ కప్ జట్లలో ఎంపికయ్యాడు.
(3 / 10)
Happy Birthday Suryakumar Yadav: స్కై (SKY) అని అందరూ ముద్దుగా పిలుచుకునే సూర్యకుమార్ ముంబైలో పుట్టాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున రాణించి ఇండియన్ టీమ్ లోకి వచ్చాడు.
(4 / 10)
Happy Birthday Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ రికార్డుల గురించి, అతని ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే 2016లో దేవిషా శెట్టిన పెళ్లి చేసుకున్న సూర్య లవ్ స్టోరీ మాత్రం చాలా ఆసక్తికరం. దీని గురించి అందరూ తెలుసుకోవాల్సిందే.
(5 / 10)
Happy Birthday Suryakumar Yadav: సూర్య భార్య దేవిషా శెట్టి ఓ ప్రొఫెషనల్ డ్యాన్సర్. ముంబైలో డ్యాన్స్ కోచ్ గానూ చేసింది. 2013 నుంచి 2015 మధ్య ది లైట్ హౌజ్ అనే ఓ ఎన్జీవోలో పని చేసింది.
(6 / 10)
Happy Birthday Suryakumar Yadav: సూర్య, దేవిషాలది ప్రేమ వివాహం. వీళ్ల లవ్ స్టోరీ టీమిండియా ప్లేయర్స్ అందరికీ తెలుసు.
(7 / 10)
Happy Birthday Suryakumar Yadav: సూర్య, దేవిషా కలిసి చదువుకున్నారు. 2012లో ముంబైలోని ఆర్ఏ పొద్దార్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో వీళ్లు కలిశారు. సూర్యపై దేవిషా మనసు పారేసుకుంది. అప్పటి నుంచీ వీళ్ల లవ్ స్టోరీ మొదలైంది.
(8 / 10)
Happy Birthday Suryakumar Yadav: క్రికెట్ లో బిజీగా ఉండే సూర్య కాలేజీకి సరిగ్గా వెళ్లే వాడు కాదు. దేవిషా మాత్రం చదువులో బెస్ట్. స్నేహంగా మొదలైన వీళ్ల బంధం తర్వాత ప్రేమగా మారింది. సూర్యనే దేవిషాకు ప్రపోజ్ చేయడం విశేషం.
(9 / 10)
Happy Birthday Suryakumar Yadav: కొన్నేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట తర్వాత తమ కుటుంబాలకు చెప్పి 2016లో పెళ్లితో ఒక్కటయ్యారు. వీళ్ల పెళ్లికి కుటుంబాల నుంచి ఎలాంటి అడ్డంకులూ ఎదురు కాలేదు.
ఇతర గ్యాలరీలు