తెలుగు న్యూస్ / ఫోటో /
Euro Prize Money: యూరో, కోపా అమెరికా, వింబుల్డన్.. ఏ టోర్నీలో ఎవరు ఎంత ప్రైజ్‌మనీ అందుకున్నారో తెలుసా?
- Euro Prize Money: ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు మూడు మెగా టోర్నీల ఫైనల్స్ జరిగాయి. ఓవైపు యూరో కప్ ఫైనల్, మరోవైపు కోపా అమెరికా ఫైనల్, ఇంకోవైపు వింబుల్డన్ ఫైనల్స్.. మరి ఈ మూడు మెగా టోర్నీల్లో గెలిచిన వాళ్లు ఎంత ప్రైజ్ మనీ అందుకున్నారో తెలుసా?
- Euro Prize Money: ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు మూడు మెగా టోర్నీల ఫైనల్స్ జరిగాయి. ఓవైపు యూరో కప్ ఫైనల్, మరోవైపు కోపా అమెరికా ఫైనల్, ఇంకోవైపు వింబుల్డన్ ఫైనల్స్.. మరి ఈ మూడు మెగా టోర్నీల్లో గెలిచిన వాళ్లు ఎంత ప్రైజ్ మనీ అందుకున్నారో తెలుసా?
(1 / 5)
Euro Prize Money: స్పోర్టింగ్ ఈవెంట్స్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటాయి. అందులోనూ ఫుట్‌బాల్, టెన్నిస్ లాంటి అత్యంత ఆదరణ ఉన్న ఆటలకు సంబంధించి ఒకే రోజు మూడు మెగా టోర్నీల ఫైనల్స్ జరగడం అంటే మాటలు కాదు. ఆదివారం (జులై 14) అదే జరిగింది. యూరో 2024, కోపా అమెరికా 2024, వింబుల్డన్ 2024 ఫైనల్స్ లో వరుసగా స్పెయిన్, అర్జెంటీనా, కార్లోస్ అల్కరాజ్ విజేతలుగా నిలిచారు. మరి వీళ్లలో ఎవరు ఎంత ప్రైజ్ మనీ అందుకున్నారో చూడండి.
(2 / 5)
Euro Prize Money: నాలుగోసారి యూరో కప్ గెలిచి అత్యధికసార్లు ఈ టైటిల్ అందుకున్న దేశంగా స్పెయిన్ చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీ గెలిచినందుకు మొత్తంగా స్పెయిన్ కు ఏకంగా 28.25 మిలియన్ యూరోలు (సుమారు రూ.257 కోట్లు) దక్కాయి. ఈ మెగా టోర్నీలో ఒక్కో మ్యాచ్, రౌండ్ అధిగమిస్తే ఒక్కో ప్రైజ్ మనీ దక్కడంతోపాటు చివరిగా ఛాంపియన్స్, రన్నరప్స్ కు ప్రత్యేకమైన ప్రైజ్ మనీ ఉంటుంది.
(3 / 5)
Euro Prize Money: ఛాంపియన్ టీమ్ స్పెయిన్ కేవలం యూరో 2024లో పాల్గొన్నందుకు 9.25 మిలియన్ యూరోలు దక్కాయి. ఇక గ్రూప్ స్టేజ్ లో ఒక్కో మ్యాచ్ గెలిచినందుకు 3 మిలియన్ యూరోలు, ఆ తర్వాత ప్రీక్వార్టర్స్ చేరిందుకు 1.5 మిలియన్ యూరోలు, క్వార్టర్స్ చేరినందుకు 2.5 మిలియన్ యూరోలు, సెమీఫైనల్స్ చేరినందుకు 4 మిలియన్ యూరోలు దక్కాయి. ఇక ఛాంపియన్ గా నిలిచినందుకు మరో 8 మిలియన్ యూరోలు లభించాయి. ఇలా మొత్తంగా 28.25 మిలియన్ యూరోలు స్పెయిన్ టీమ్ ఖాతాలో చేరాయి.
(4 / 5)
Euro Prize Money: ఇక అటు కోపా అమెరికా టైటిల్ ను 16వ సారి గెలిచి చరిత్ర సృష్టించిన అర్జెంటీనా జట్టుకు 18 మిలియన్ డాలర్లు (సుమారు రూ.151 కోట్లు) దక్కడం విశేషం. కోపా అమెరికాలో పాల్గొన్నందుకే అర్జెంటీనాకు 2 మిలియన్ డాలర్లు దక్కగా.. టైటిల్ గెలిచినందుకు మరో 16 మిలియన్ డాలర్లు వచ్చాయి.
ఇతర గ్యాలరీలు