CM KCR Inspection: కౌలు రైతులను కూడా ఆదుకోవాలి - ముఖ్యమంత్రి కేసీఆర్-cm kcr inspection of crop damage in four districts ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cm Kcr Inspection: కౌలు రైతులను కూడా ఆదుకోవాలి - ముఖ్యమంత్రి కేసీఆర్

CM KCR Inspection: కౌలు రైతులను కూడా ఆదుకోవాలి - ముఖ్యమంత్రి కేసీఆర్

Mar 23, 2023, 03:41 PM IST HT Telugu Desk
Mar 23, 2023, 03:41 PM , IST

CM KCR Inspection of Crop Damage: పంట నష్టం ప్రభావిత జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. అకాల వర్షాల దాటికి పాడైపోయిన పంటలను స్వయంగా పరిశీలించారు. మొదట ఖమ్మం జిల్లాలో పర్యటించిన తర్వాత....ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.

ఖమ్మం జిల్లా రావినూతలపాడులో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్... గాలివాన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంటలు కలిపి రాష్ట్రంలో 2 లక్షల 22 వేల 250 ఎకరాల్లో నష్టం కలిగిందన్నారు. ముఖ్యంగా మొక్కజొన్న 1,29,446 ఎకరాలు, వరి 72, 709 ఎకరాలు, మామిడి 8,865 ఎకరాలు, ఇతర పంటలు 17, 238 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కోడ్ ప్రకారం రైతులకు పెద్దగా ఏం రాదని చెప్పారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా ఉందని... మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కంటే కూడా అత్యధిక తలసరి ఆదాయం కలిగి ఉన్నామని పేర్కొన్నారు. రైతులు ఏమాత్రం నిరాశకు గురికావద్దని కోరారు. ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుందని స్పష్టం చేశారు. 

(1 / 5)

కేంద్రానికి చెప్పినా.. గోడకు చెప్పినా ఒకటే పరిస్థితి అన్నట్లు ఉందన్నారు సీఎం కేసీఆర్. దేశానికి కొత్త అగ్రికల్చర్ పాలసీ అవసరం ఉందన్న ఆయన... మొత్తం వ్యవసాయ పాలసీని బీఆర్ఎస్ ఇస్తుందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితే వస్తే కేంద్రం తీరు దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కులు మొరిగినట్లుగా ఉంటుందని విమర్శించారు.  ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం  దుర్మార్గంగా వ్యవహరిస్తూ.. దేశంలో రాజకీయాలు తప్ప రైతులు లేరు, ప్రజలు లేరు అన్నట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.  గతంలో కేంద్రానికి నివేదికలు పంపినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. తమ రైతులను కాపాడుకుంటం.. వంద శాతం తామే ఆదుకుంటామని చెప్పారు. 

(2 / 5)

"ఎకరానికి రూ.10 వేలను అందిస్తాం.  కౌలు రైతులను కూడా ఆదుకునేలా ఆదేశాలు జారీ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రబ్బరు బంతుల్లాగా తిరిగి ఎగిరే విధంగా రైతులు పుంజుకోవాలి.  రైతులు ధైర్యం కోల్పోవద్దని మనవి. దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కేంద్రం వ్యవహరిస్తోంది. రూ.228 కోట్లను వెంటనే మంజూరు చేస్తున్నాం" అని చెప్పారు.

(3 / 5)

అనంతరం పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాలో మాట్లాడిన కేసీఆర్... దేశంలోనే ఎక్కడాలేని విధంగా 24 గంటల ఉచిత కరెంటును, రైతుబంధు సదుపాయం ఇస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టుల నుంచి నీళ్లు కూడా ఉచితంగా ఇచ్చుకొని వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. అన్ని రకాల పంటలు కలిపితే దాదాపు 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో సాగు ఉందని... నేడు 56 లక్షల ఎకరాల్లో ఒక్క వరి సాగులో ఉందని వివరించారు.  వాస్తవానికి ఎకరానికి సాధారణంగా రూ.3 వేలే ఇస్తారు కానీ... కానీ మనం అలా కాకుండా ఎకరానికి రూ.10 వేలు ఇవ్వమని చెప్పి డబ్బులు మంజూరు చేశామని చెప్పుకొచ్చారు. 

(4 / 5)

కౌలుకు తీసుకున్న రైతులు పెట్టుబడి పెట్టి నష్టపోయారని కేసీఆర్ అన్నారు. వారిని కూడా ఆదుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. తెలంగాణలో అందరు మంచిగా బతకాలి అని ఆకాంక్షించారు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు