CM Chandrababu : జేసీబీపై ఎక్కి వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన, సహాయ చర్యలపై నిరంతరం పర్యవేక్షణ
- CM Chandrababu : విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. యనమలకుదురు, పడమట, రామలింగేశ్వర్ నగర్, జక్కంపూడి, భవానీ పురం, ప్రకాశం బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడుతున్నారు.
- CM Chandrababu : విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. యనమలకుదురు, పడమట, రామలింగేశ్వర్ నగర్, జక్కంపూడి, భవానీ పురం, ప్రకాశం బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడుతున్నారు.
(1 / 6)
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. యనమలకుదురు, పడమట, రామలింగేశ్వర్ నగర్, జక్కంపూడి, భవానీ పురం, ప్రకాశం బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడుతున్నారు. ముంపు నివారణ చర్యలను క్షేత్రస్థాయి నుంచే సీఎం పర్యవేక్షిస్తున్నారు.
(2 / 6)
భవానీపురం సితార సెంటర్ వరద ప్రభావిత ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. జేసీబీపై ఎక్కి వరద ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు.
(3 / 6)
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం సింగ్ నగర్ ప్రాంతానికి వెళ్లారు. బోటులో వెళ్లి సహాయ కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌కు వచ్చి మరోసారి సమీక్ష నిర్వహించి సహాయ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
(4 / 6)
కృష్ణలంక, జక్కంపూడి తదితర ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. బాధితులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున చేపట్టిన పునరావాస కార్యక్రమాలు, ఆహార పంపిణీపై అడిగి తెలుసుకున్నారు.
(5 / 6)
మోకాలి లోతు నీటిలో నడుస్తూ, ఎక్కువ నీరు ఉన్న ప్రాంతాల్లో బోటు ద్వారా బాధితుల వద్దకు చేరుకుని సీఎం చంద్రబాబు స్వయంగా వారి కష్టాలు తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదుల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీచేస్తున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ధైర్యంగా ఉండాలంటూ భరోసా కల్పించారు.
ఇతర గ్యాలరీలు