Banknotes with star symbol: నంబర్ పై స్టార్ మార్క్ ఉన్న కరెన్సీ నోట్లు అసలైనవేనా? లేక నకిలీవా?-banknotes with star symbol are they legal what rbi says amid social media controversy ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Banknotes With Star Symbol: Are They Legal? What Rbi Says Amid Social Media Controversy

Banknotes with star symbol: నంబర్ పై స్టార్ మార్క్ ఉన్న కరెన్సీ నోట్లు అసలైనవేనా? లేక నకిలీవా?

Jul 28, 2023, 03:08 PM IST HT Telugu Desk
Jul 28, 2023, 03:08 PM , IST

Banknotes with star symbol: కరెన్సీ నోట్లపై నంబర్ ప్యానెల్ వద్ద స్టార్ (*) మార్క్ ఉండడం చర్చనీయాంశమైంది. అలా నంబర్ ప్రారంభమయ్యే ముందు స్టార్ మార్క్ ఉన్న నోట్లు నకిలీవనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో, ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరణ ఇచ్చింది.

నంబర్ పై స్టార్ () మార్క్ ఉన్న కరెన్సీ నోట్లు నిజమైనవా? లేక నకిలీవా? అన్న అనుమానంపై ఆర్బీఐ వివరణ ఇచ్చింది. 

(1 / 7)

నంబర్ ప్యానెల్ వద్ద స్టార్ (*)  మార్క్ ఉండడంపై ఆర్బీఐ వివరణ ఇచ్చింది. అవి నకిలీవి కావని, అవి కూడా ఒరిజినల్ నోట్లేనని స్పష్టం చేసింది.  స్టార్ (*)  మార్క్ లేని ఇతర బ్యాంక్ నోట్ల మాదిరిగానే ఇవి కూడా నిజమైనవేనని  స్పష్టం చేసింది.

(2 / 7)

అలా నంబర్ ప్యానల్ వద్ద ఉన్న స్టార్ (*) మార్క్ ను ఐడెంటిఫైయర్ అని ఆర్బీఐ తెలిపింది. అంటే, అలా స్టార్ మార్క్ ఉన్న బ్యాంక్ నోట్లు పాడై పోయిన, లేదా తప్పుగా ముద్రించిన నోట్ల స్థానంలో, వాటికి ప్రత్యామ్నాయంగా ప్రింట్ చేసినవని తెలిపింది. అంటే స్టార్ మార్క్ ఉన్న నోట్లు ఒక నంబర్ సిరీస్ లో తప్పుగా ప్రింట్ అయిన నోట్ల స్థానంలో ప్రింట్ చేసినవన్న మాట. అలా రీ ప్రింటెడ్ నోట్స్ అని గుర్తించడానికి వీలుగా నంబర్ ప్యానెల్ వద్ద స్టార్ మార్క్ ను ముద్రిస్తారు. 

(3 / 7)

 రీ ప్రింటెడ్ నోట్స్ అని గుర్తించడానికి వీలుగా నంబర్ ప్యానెల్ వద్ద స్టార్ మార్క్ ను ముద్రించడం అనే విధానాన్ని అవలంబిస్తున్నామని ఆర్బీఐ వెల్లడించింది. ఒక నంబర్ సిరీస్ లో తప్పుడు నోటు ప్రింట్ అయితే, ఆ నంబర్ ఉన్న నోటుకు ప్రత్యామ్నాయంగా ఇలా స్టార్ మార్క్ తో అదే నంబర్ తో మరో నోటును ముద్రిస్తామని తెలిపింది.

(4 / 7)

ఒక బ్యాంక్ నోటు నంబర్ ప్యానెల్ వద్ద స్టార్ మార్క్ ఉంటే, అది రీ ప్రింటెడ్ లేదా రీ ప్లేస్డ్ నోటు అని గుర్తించాలని ఆర్బీఐ తెలిపింది. ఆ నోట్ల పై ఆంగ్ల అక్షరాల ప్రి ఫిక్స్ కు, నంబర్ కు మధ్య ఈ స్టార్ మార్క్ ను ముద్రిస్తామని తెలిపింది. 

(5 / 7)

గతంలో అలా రీ ప్రింటెడ్ నోట్లకు ప్రత్యేక నంబర్ సిరీస్ ఉండేది. 2006 ఆగస్ట్ నుంచి ఇలా స్టార్ మార్క్ విధానాన్ని అవలంబించడం ప్రారంభించారు.

(6 / 7)

అందువల్ల, కరెన్సీ నోట్ల నంబర్ ప్యానెల్ పై స్టార్ మార్క్ ఉంటే అది నకిలీ నోటేమో అన్న భయం అక్కర్లేదు. అవి కూడా ఒరిజినల్ నోట్లే అని ఆర్బీఐ స్పష్టం చేసింది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు