తెలుగు న్యూస్ / ఫోటో /
ICC Rankings: ఏకంగా ఆరు స్థానాలు పడిపోయిన బాబర్ ఆజమ్.. కోహ్లీ రెండో ర్యాంకులు పైకి..
- ICC Test Rankings: పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్.. ఐసీసీ ర్యాంకింగ్‍ల్లో ఒకేసారి ఆరు స్థానాలు దిగజారాడు. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రెండు ర్యాంకులు మెరుగుపరుచుకున్నాడు.
- ICC Test Rankings: పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్.. ఐసీసీ ర్యాంకింగ్‍ల్లో ఒకేసారి ఆరు స్థానాలు దిగజారాడు. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రెండు ర్యాంకులు మెరుగుపరుచుకున్నాడు.
(1 / 6)
పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజమ్ కొంతకాలంగా పేలప ఫామ్‍లో ఉన్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‍తో తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డకౌట్, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులే చేశాడు. వరుసగా విఫలమవుతున్న బాబర్ ఆజమ్.. ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్‍ల్లో భారీగా దిగజారాడు. (AFP)
(2 / 6)
ఐసీసీ తాజా (ఆగస్టు 28) టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో బాబర్ ఆజమ్ ఆరు స్థానాలు కిందికి వచ్చాడు. మూడో స్థానం నుంచి ఏకంగా తొమ్మిదో ర్యాంకుకు పడిపోయాడు. బంగ్లా చేతిలో పాక్ 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడింది. (AP)
(3 / 6)
బంగ్లాతో టెస్టులో సెంచరీతో రాణించిన పాక్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ ఏడు స్థానాలు మెరుగుపరుచుకొని 11వ ర్యాంకుకు ఎగబాకాడు. సౌద్ షకీల్ ఓ ప్లేస్ పైకి వచ్చి 13 స్థానానికి చేరాడు. (AP)
(4 / 6)
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో రెండు స్థానాలు పైకి ఎగబాకాడు. ఎనిమిదో ర్యాంకుకు చేరాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆరో స్థానంలో కొనసాగాడు. యశస్వి జైస్వాల్ ఏడో ప్లేస్‍కు చేరాడు. ఇలా ముగ్గురు భారత ఆటగాళ్లు.. టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-10లో ఉన్నారు. (PTI)
(5 / 6)
ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ ఫస్ట్ ర్యాంకులో కొనసాగాడు. రెండో, మూడో ర్యాంకుల్లో న్యూజిలాండ్ స్టార్స్ కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ వరుసగా ఉన్నారు. నాలుగో ర్యాంకులో ఇంగ్లండ్ యంగ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్స్, ఐదో స్థానంలో ఆస్ట్రేలియా సీనియర్ స్టీవ్ స్మిత్ ఉన్నారు. (Action Images via Reuters)
ఇతర గ్యాలరీలు