Ambedkar Statue: అంబేడ్కర్ స్మృతివనం… త్వరలోనే సందర్శకులకు అనుమతి-arrangements for to allow tourists in the hyderabad ambedkar memorial park with in 30 days ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ambedkar Statue: అంబేడ్కర్ స్మృతివనం… త్వరలోనే సందర్శకులకు అనుమతి

Ambedkar Statue: అంబేడ్కర్ స్మృతివనం… త్వరలోనే సందర్శకులకు అనుమతి

Apr 20, 2023, 07:40 PM IST HT Telugu Desk
Apr 20, 2023, 07:40 PM , IST

  • 125 feet Ambedkar Statue in  Hyderabad: హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ .బీఆర్ అంబేడ్కర్ కొలువుదీరిన సంగతి తెలిసిందే. అయితే అతి త్వరలోనే అంబేడ్కర్‌ స్మృతివనాన్ని కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

నెల రోజుల్లో పూర్తిస్థాయిలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ప్రారంభించడానికి తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 14వ తేదీన అధికారికంగా ప్రారంభించినప్పటికీ… కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి. 

(1 / 6)

నెల రోజుల్లో పూర్తిస్థాయిలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ప్రారంభించడానికి తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 14వ తేదీన అధికారికంగా ప్రారంభించినప్పటికీ… కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి. (facebook)

వచ్చే 20 రోజుల్లోగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. అన్నీ కుదిరితే మే మూడో వారంలో అంబేడ్కర్ స్మృతి వనంలోకి పర్యాటకులను అనుమతించాలని చూస్తోంది.

(2 / 6)

వచ్చే 20 రోజుల్లోగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. అన్నీ కుదిరితే మే మూడో వారంలో అంబేడ్కర్ స్మృతి వనంలోకి పర్యాటకులను అనుమతించాలని చూస్తోంది.(facebook)

అంబేడ్కర్‌ విగ్రహం 125 అడుగుల ఎత్తు ఉంది. అయితే దీని పీఠం 50 అడుగుల ఎత్తులో ఉంది. పీఠం లోపలి భాగంలో 30 అడుగుల హాలును రూపొందించారు. ఇందులోని థియేటర్‌ను ఒకేసారి వందమంది కూర్చోడానికి వీలుగా తీర్చిదిద్దారు. 

(3 / 6)

అంబేడ్కర్‌ విగ్రహం 125 అడుగుల ఎత్తు ఉంది. అయితే దీని పీఠం 50 అడుగుల ఎత్తులో ఉంది. పీఠం లోపలి భాగంలో 30 అడుగుల హాలును రూపొందించారు. ఇందులోని థియేటర్‌ను ఒకేసారి వందమంది కూర్చోడానికి వీలుగా తీర్చిదిద్దారు. (facebook)

పీఠం లోపలి భాగంలో అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపేలా ఏర్పాట్లు చేశారు. పలు అరుదైన ఫొటోలను  ప్రదర్శించనున్నారు.

(4 / 6)

పీఠం లోపలి భాగంలో అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపేలా ఏర్పాట్లు చేశారు. పలు అరుదైన ఫొటోలను  ప్రదర్శించనున్నారు.(facebook)

భారీ  విగ్రహం చుట్టూ దాదాపు 9 ఏకరాల్లో మెమొరియల్ పార్కు ఉంది. ఇక్కడే మ్యూజియం, లైబ్రరీ కూడా ఉంటాయి. ఇక స్మృతివనంలోకి పర్యాటకులను ఉచితంగా అనుమతించాలా? టికెట్ పెట్టాలా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

(5 / 6)

భారీ  విగ్రహం చుట్టూ దాదాపు 9 ఏకరాల్లో మెమొరియల్ పార్కు ఉంది. ఇక్కడే మ్యూజియం, లైబ్రరీ కూడా ఉంటాయి. ఇక స్మృతివనంలోకి పర్యాటకులను ఉచితంగా అనుమతించాలా? టికెట్ పెట్టాలా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.(facebook)

హైదరాబాద్ లోని ఈ అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాం ఐకానిక్ సెంటర్ గా మారింది. చాలా మంది పర్యాటకలు సందర్శించే అవకాశం ఉంది.  అందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్మృతి వనంలో దాదాపు 450 కార్లు పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది. 

(6 / 6)

హైదరాబాద్ లోని ఈ అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహాం ఐకానిక్ సెంటర్ గా మారింది. చాలా మంది పర్యాటకలు సందర్శించే అవకాశం ఉంది.  అందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్మృతి వనంలో దాదాపు 450 కార్లు పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది. (facebook)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు