Asthma Ayurvedic Remedies: ఆస్తమా నుంచి ఉపశమనం కలిగించే ఆయుర్వేద మూలికలు ఇవే!-5 ayurvedic herbs to ease asthma symptoms naturally ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Asthma Ayurvedic Remedies: ఆస్తమా నుంచి ఉపశమనం కలిగించే ఆయుర్వేద మూలికలు ఇవే!

Asthma Ayurvedic Remedies: ఆస్తమా నుంచి ఉపశమనం కలిగించే ఆయుర్వేద మూలికలు ఇవే!

May 03, 2023, 01:06 PM IST HT Telugu Desk
May 03, 2023, 01:06 PM , IST

  • Asthma Ayurvedic Remedies: ఆస్తమా అనేది పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరినైనా వేధించే సమస్య. ఉబ్బసం ఉన్నవారు కొన్ని ఆయుర్వేద మూలికలను తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

ఆయుర్వేదం ప్రకారంగా, కొన్ని సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఉబ్బసం సమస్యను నివారించగలవు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్తమా లక్షణాలను తగ్గించగలవు. అదే సమయంలో మీ డాక్టర్ సూచించిన ఔషధాలు, నాసల్ స్పేలు కూడా ఉపయోగించడం మరిచిపోవద్దు. 

(1 / 6)

ఆయుర్వేదం ప్రకారంగా, కొన్ని సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఉబ్బసం సమస్యను నివారించగలవు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్తమా లక్షణాలను తగ్గించగలవు. అదే సమయంలో మీ డాక్టర్ సూచించిన ఔషధాలు, నాసల్ స్పేలు కూడా ఉపయోగించడం మరిచిపోవద్దు. (Freepik)

వెల్లుల్లి: వెల్లుల్లి,  పసుపులో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. అదే సమయంలో, ఈ రెండు పదార్థాలు ఛాతీలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని క్లియర్ చేస్తాయి. ఫలితంగా, శ్వాసకోశ బాధ క్రమంగా తగ్గుతుంది. 

(2 / 6)

వెల్లుల్లి: వెల్లుల్లి,  పసుపులో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. అదే సమయంలో, ఈ రెండు పదార్థాలు ఛాతీలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని క్లియర్ చేస్తాయి. ఫలితంగా, శ్వాసకోశ బాధ క్రమంగా తగ్గుతుంది. (Freepik)

అల్లం: అల్లం కూడా ఆస్తమాకు మంచి ఔషధం. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది  కఫాన్ని తొలగించడం ద్వారా వాయుమార్గాలను క్లియర్ చేస్తుంది. ఆస్తమాను కూడా అదుపులో ఉంచుతుంది. 

(3 / 6)

అల్లం: అల్లం కూడా ఆస్తమాకు మంచి ఔషధం. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది  కఫాన్ని తొలగించడం ద్వారా వాయుమార్గాలను క్లియర్ చేస్తుంది. ఆస్తమాను కూడా అదుపులో ఉంచుతుంది. (Freepik)

తులసి: తులసి  ఆకులు తీసుకుంటే శ్వాసనాళంలో పేరుకుపోయిన కఫం, శ్లేష్మాన్ని సులభంగా తొలగిస్తుంది. అదే సమయంలో, తులసి ఆకుల్లోని ఔషధ గుణాలు ఛాతీలో పేరుకుపోయిన బ్యాక్టీరియా , వైరస్ లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. 

(4 / 6)

తులసి: తులసి  ఆకులు తీసుకుంటే శ్వాసనాళంలో పేరుకుపోయిన కఫం, శ్లేష్మాన్ని సులభంగా తొలగిస్తుంది. అదే సమయంలో, తులసి ఆకుల్లోని ఔషధ గుణాలు ఛాతీలో పేరుకుపోయిన బ్యాక్టీరియా , వైరస్ లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. (Freepik)

నీలవేము: ఛాతీ నుండి చల్లని కఫాన్ని తొలగించడానికి  నీలవేము బాగా పనిచేస్తుంది. నీలవేము ఆకుల రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్తమా సమస్య అదుపులో ఉంటుంది. 

(5 / 6)

నీలవేము: ఛాతీ నుండి చల్లని కఫాన్ని తొలగించడానికి  నీలవేము బాగా పనిచేస్తుంది. నీలవేము ఆకుల రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్తమా సమస్య అదుపులో ఉంటుంది. (Freepik)

వాసక ఆకులు: వాసక అనేది ఒక ఔషధ మొక్క. వాసక ఆకులను ఆస్తమా రోగులకు సిఫార్సు చేస్తారు. దీని ఆకులు చికితలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి.  దీనివల్ల శ్వాస సమస్యలు తగ్గడమే కాకుండా ఊపిరితిత్తుల వ్యాధులు కూడా తగ్గుతాయి. 

(6 / 6)

వాసక ఆకులు: వాసక అనేది ఒక ఔషధ మొక్క. వాసక ఆకులను ఆస్తమా రోగులకు సిఫార్సు చేస్తారు. దీని ఆకులు చికితలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి.  దీనివల్ల శ్వాస సమస్యలు తగ్గడమే కాకుండా ఊపిరితిత్తుల వ్యాధులు కూడా తగ్గుతాయి. (Freepik)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు