Income Tax Return: సులభంగా ఐటీఆర్‌ను ఇలా ఫైల్ చేయండి-know how to file itr using the new tax filing portal ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Income Tax Return: సులభంగా ఐటీఆర్‌ను ఇలా ఫైల్ చేయండి

Income Tax Return: సులభంగా ఐటీఆర్‌ను ఇలా ఫైల్ చేయండి

Manda Vikas HT Telugu
Jul 25, 2022 05:58 PM IST

Income Tax Return: ప్రస్తుతం వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్నులు వ్యక్తులు దాఖలు చేయడానికిITR-1, ITR- 4 అందుబాటులో ఉన్నాయి. . ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం కొత్త పోర్టల్ వేగవంతమైన ప్రాసెసింగ్, రీఫండ్‌లకు వీలుగా ఉంటుందని తెలిపింది.

<p>ITR Filing&nbsp;</p>
ITR Filing (Stock Photo)

Income Tax Return: ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు, టాక్స్‌లకు సంబంధించి ఇతర ప్రక్రియలను మరింత సులభతరం చేయడానికి ఆదాయపు పన్ను శాఖ యూజర్ ఫ్రెండ్లీగా ఉండే కొత్త వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం కొత్త పోర్టల్ వేగవంతమైన ప్రాసెసింగ్, రీఫండ్‌లకు వీలుగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్నులు వ్యక్తులు దాఖలు చేయడానికి ITR 1 , ITR 4 అందుబాటులో ఉన్నాయి.

కొత్త పోర్టల్‌ ద్వారా మీరు మీ ITR ని ఎలా ఫైల్ చేయవచ్చో తెలుసుకోండి:

స్టెప్ 1:

మీరు మొదటిసారిగా ఐటీఆర్ దాఖలు చేస్తున్న వారైతే ముందుగా మీ PAN కార్డ్ నెంబర్ ఆధారంగా యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదివరకే రిజిస్టరై ఉంటే, మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి ఇన్ కమ్ టాక్స్ పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి.

స్టెప్ 2:

ఇప్పుడు పైన ఆప్షన్లలో “ఈ-ఫైల్” ట్యాబ్‌పై క్లిక్ చేయండి, ఆపై “ఫైల్ ఐటీఆర్” పై క్లిక్ చేయండి.

స్టెప్ 3:

మీరు దాఖలు చేయబోయే ఐటీఆర్ అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎంచుకుని, అనంతరం కంటిన్యూపై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ITR ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఫైల్ చేయాలనుకుంటున్నారా? అని అడుగుతుంది. ఎలాగైనా మీరు ఐటీఆర్ దాఖలు చేసుకోవచ్చు, అయితే ఆన్‌లైన్‌ విధానం సులభతరం.

స్టెప్ 4:

ఇక్కడ మీరు ITR ని ఒక వ్యక్తిగానా (Individual), లేదా ఇతరులుగా ఫైల్ చేయాలనుకుంటున్నారా? అనే ఆప్షన్ అడుగుతుంది. మీకు సరిపోయే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇండివిడ్యువల్ ఎంచుకుంటే..

స్టెప్ 5:

ఇక్కడ మీరు మీ వార్షిక ఆదాయాన్ని బట్టి దాఖలు చేసేందుకు అర్హత గల ITR ని ఎంచుకోవాలి. వేతనం లేదా పెన్షన్, ప్రాపర్టీగా ఒక ఇల్లు, రూ. 5 వేల వరకు వ్యవసాయ ఆదాయం, ఇతర ఆదాయాలు కలిగి ఉండి వార్షిక ఆదాయం రూ. 50 లక్షల లోపు ఉంటే, వారు ఐటీఆర్ 1ను ఎంచుకోవాలి.

వేతనం, వ్యాపారపరంగా కూడా ఆదాయం లేకుండా ఇంటి ప్రాపర్టీలు ఎక్కువ ఉండి, వారసత్వ ఆదాయం కలిగినవారు ఐటీఆర్ 2ను ఎంచుకోవాలి. వార్షికాదాయం రూ. 50 లక్షల పైగా ఉన్న వారికి ఐటీఆర్ 2 వర్తిస్తుంది. ఆదాయం. రూ. 2 కోట్ల పైబడి టర్నోవర్ కలిగి ఉంటే ఐటీఆర్ 3 వర్తిస్తుంది. ప్రస్తుతానికి వ్యక్తులు తమ ఐటీఆర్ దాఖలు చేసేందుకు ఐటీఆర్1, 4 మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది.

స్టెప్ 6:

ఐటీఆర్ ఎందుకు దాఖలు చేయదల్చుకున్నారో కారణం అడగుతుంది. సెక్షన్ 139 (1) నిబంధనలకు లోబడి సరైన ఎంపికను ఎంచుకొని కొనసాగించాలి.

స్టెప్ 7:

ఇక్కడ మీరు రీఫండ్‌లు పొందాలనుకుంటున్న బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలి.

స్టెప్ 8:

ఇప్పుడు మీరు మీ ఐటీఆర్ సమర్పించే చివరి దశకు చేరుకున్నారు. ఆ ఏడాదికి సంబంధించి మీ బ్యాంక్ వడ్డీ, మూలధన లాభాలు మొదలైన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. అదంతా సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఐటీఆర్ కన్ఫర్మ్ చేయాలి.

స్టెప్ 9:

ఇది చివరిది, కీలమైనది. మీరు దాఖలు చేసిన ఐటీఆర్‌ను ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ ధృవీకరణ లేకుండా ITR ఫైలింగ్ ప్రక్రియ పూర్తి కాదని గుర్తుంచుకోండి. ఐటీఆర్ వెరిఫై ఆప్షన్ ద్వారా ఆధార్ కార్డ్ ఆధారిత మొబైల్ నెంబరుకు ఓటీపీ ఎంటర్ చేసి లేదా మీరి ఇవ్వబడిన ‌బ్యాంక్ ఖాతాకు సంబంధించి నెట్ బ్యాంకింగ్ ద్వారా వెరిఫై చేయవచ్చు లేదా బెంగళూరుకు హార్డ్ కాపీని పంపడం ద్వారా ఈ మూడింటిలో ఏదో మార్గాన్ని ఎంచుకొని వెరిఫై చేస్తే, ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ పరిసమాప్తం అయినట్లే.

దీని తర్వాత మిగతాది ఆదాయపు పన్ను శాఖ చూసుకుంటుంది. మీ రీఫండ్ ఎంతవరకు వచ్చిందనే స్టేటస్ పోర్టల్‌లో ఎప్పుడైనా చూసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం