శంషాబాద్‌లో భారీగా పట్టుబడిన కొకైన్.....-cocaine caught in samshabad airport ,national న్యూస్
తెలుగు న్యూస్  /  national  /  శంషాబాద్‌లో భారీగా పట్టుబడిన కొకైన్.....

శంషాబాద్‌లో భారీగా పట్టుబడిన కొకైన్.....

HT Telugu Desk HT Telugu
May 02, 2022 07:07 PM IST

శంషాబాద్ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు 80కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల కదలికలు అనుమానస్పదంగా ఉండటంతో వారిని తనిఖీ చేయడంతో కోట్లాది రుపాయల విలువైన డ్రగ్స్‌ బయటపడ్డాయి.

<p>శంషాబాద్‌లో స్వాధీనం చేసుకున్న కొకైన్</p>
శంషాబాద్‌లో స్వాధీనం చేసుకున్న కొకైన్

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్‌ బయటపడ్డాయి. మే1 అర్ధరాత్రి దాటాక కేప్‌టౌన్‌ నుంచి దుబాయ్‌ మీదుగా బిజినెస్‌ వీసాపై హైదరాబాద్‌ వచ్చిన టాంజానియా దేశస్తుడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేస్తే భారీగా డ్రగ్స్‌ బయటపడ్డారు. ఇతనితో పాటు అంగోలా నుంచి టూరిస్ట్‌ వీసాపై హైదరాబాద్‌ వచ్చిన మరో మహిళ వద్ద కూడా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అంగోలా నుంచి మొజాంబిక్‌-లుసాకా-దుబాయ్‌ల మీదుగా ఆ మహిళ హైదరాబాద్‌ చేరుకుంది. వీరిద్దరి వద్ద నుంచి కోట్ల రుపాయల విలువ చేసే కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 8కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్కరి వద్ద 4కేజీల కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. ట్రాలీ బ్యాగుల అడుగున ఏర్పాటు చేసిన అరల్లో డ్రగ్స్‌ దాచిపెట్టినట్లు గుర్తించారు. నిందితుల వద్ద దొరికిన కొకైన విలువ దాదాపు 80కోట్ల వరకు ఉంటుందని డిఆర్‌ఐ అంచనా వేసింది.

<p>సూట్‌కేస్‌ అడుగు భాగంలో ఏర్పాటు చేసిన అర</p>
సూట్‌కేస్‌ అడుగు భాగంలో ఏర్పాటు చేసిన అర

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల రూపంలో డ్రగ్స్‌ రవాణా చేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయి. కోవిడ్‌ ఆంక్షల తర్వాత క్రమంగా విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుండటంతో డ్రగ్స్‌ రవాణా ముఠాలు రవాణా పెంచాయి. దీంతో కస్టమ్స్‌ అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి డ్రగ్స్‌ రవాణా చేసే వారి కదలికల్ని గుర్తిస్తున్నారు. సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలగనివ్వకుండా ముఠాలను కనిపెడుతున్నారు. సాధారణ కంటితో గుర్తించలేని విధంగా డ్రగ్స్ రవాణా చేస్తుండటంతో అత్యాధునిక పరికరాలను వినియోగించి వాటిని గుర్తిస్తున్నారు. నిందితులు షాంపులు, ఆహార పదార్ధాల రూపంలో కూడా డ్రగ్స్‌ రవాణా చేస్తున్నారు. దీంతో పాటు లామినేటెడ్‌ క్యాప్సుల్స్‌ను శరీరంలో దాచుకుని ప్రయాణిస్తున్న ఉదంతాలను కూడా ఇటీవల బయటపడ్డాయి.

గత నాలుగు నెలల్లో డిఆర్‌ఐ అధికారులు అక్రమంగా డ్రగ్స్‌ రవాణా చేస్తున్న పలు ముఠాలను ఆధునిక పద్ధతుల్లో గుర్తించి పట్టుకున్నారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ముంబై విమానాశ్రయంలో 2.42కేజీల కొకైన్ కడుపులో దాచుకుని వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్ని డిఆర్‌ఐ అధికారులు గుర్తించారు. ఏప్రిల్‌లో 1.15 కేజీల కొకైన్ లామినేటెడ్ క్యాప్సుల్‌ మింగిన వ్యక్తిని హైదరాబాద్‌లో పట్టుకున్నారు. 

2021 ఆగష్టులో బెంగళూరులో కేజీ కొకైన్ పట్టుబడింది. ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు విమానాశ్రాయాలతో పాటు దేశంలోని ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాలలో కూడా కొకైన్ రవానా చేస్తూ నిందితులు పట్టుబడ్డారు. 2021 జనవరి తర్వాత డిఆర్‌ఐ అధికారులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో 350కేజీల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అక్షరాలా 3500కోట్ల రుపాయలు ఉంటుందని అంచనా. టుటికొరిన్‌ పోర్టులో ఒకేసారి 303కేజీల కొకైన్‌ను ఇటీవలి కాలంలో డిఆర్‌ఐ అధికారులు సీజ్‌ చేశారు.

Whats_app_banner

టాపిక్