iit jee advanced registration: నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ -registration for jee advanced 2022 starts today till thursday 11th august 2022 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Iit Jee Advanced Registration: నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్

iit jee advanced registration: నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్

HT Telugu Desk HT Telugu
Aug 08, 2022 11:00 AM IST

iit jee advanced registration: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్ డ్ 2022 రిజిస్ట్రేషన్ నేడు ఆగస్టు 8, 2022 సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది.

<p>iit jee advanced registration: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు నేటి సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్ మొదలవుతుంది</p>
iit jee advanced registration: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు నేటి సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్ మొదలవుతుంది

iit jee advanced registration: జేఈఈ మెయిన్స్ ఫలితాలు ఈ ఉదయం ప్రకటించారు. వీటిలో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

jeeadv.ac.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో ఆగస్టు 8 సాయంత్రం 4 గంటల తరువాత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గురువారం ఆగస్టు 11 సాయంత్రం 5 గంటల వరకే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంది.

రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ ఫీజు చెల్లించేందుకు గడువు ఆగస్టు 12, 2022గా ఉంది. అడ్మిట్ కార్డులను ఆగస్టు 23 నుంచి ఆగస్టు 28 మధ్య డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 23 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 28 మధ్యాహ్నం 2.30 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది.

దివ్యాంగులైతే ఆగస్టు 27లోపు స్క్రైబ్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆగస్టు 28, 2022న పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మూడు గంటల పాటు జరుగుతుంది. ఇక పేపర్-2 కూడా అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మూడు గంటల పాటు సాగుతుంది.

అభ్యర్థులు పరీక్షలో ఇచ్చిన సమాధానాల ప్రతి (కాపీ ఆఫ్ రెస్పాన్సెస్) సెప్టెంబరు 1 ఉదయం 10 గంటల నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ సెప్టెంబరు 3 నుంచి అందుబాటులో ఉంటుంది. దీనిపై అభ్యర్థులు మూడు, నాలుగు తేదీల్లో ఫీడ్ బ్యాక్, కామెంట్స్ ఇవ్వొచ్చు. ఫైనల్ ఆన్సర్ కీస్ సెప్టెంబరు 11న ప్రకటిస్తారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజల్ట్స్ Result of JEE (Advanced) 2022 సెప్టెంబరు 11న ఉదయం 10 గంటలకు వెల్లడిస్తారు. ముఖ్యమైన తేదీలు, షెడ్యూలు కోసం ఇక్కడ డైరెక్ట్ లింక్ క్లిక్ చేయండి.

బాంబేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ ఏడాది ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్డ్ 2022 పరీక్షను నిర్వహించనుంది. ఈ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా సీబీటీలో ఉంటుంది.

Whats_app_banner

టాపిక్