Moscow attack : మాస్కో కాన్సర్ట్​ హాల్​లో రక్తపాతం.. ఉగ్ర దాడిలో 60మంది దుర్మరణం!-moscow attack islamic state says attacked gathering of christians 60 killed ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Moscow Attack: Islamic State Says Attacked Gathering Of Christians 60 Killed

Moscow attack : మాస్కో కాన్సర్ట్​ హాల్​లో రక్తపాతం.. ఉగ్ర దాడిలో 60మంది దుర్మరణం!

Sharath Chitturi HT Telugu
Mar 23, 2024 06:43 AM IST

Russia terror attack: ఇస్లామిక్​ స్టేట్​ జరిపిన ఉగ్రదాడితో రష్యా ఉలిక్కిపడింది. మాస్కోలోని ఓ కాన్సర్ట్​ హాల్​ నెత్తురోడింది. ఆగంతకుల కాల్పుల్లో 60మంది మరణించారు. 100మంది గాయపడ్డారు.

మాస్కో కాన్సర్ట్​ హాల్​లో ఇస్లామిక్​ స్టేట్​ దాడి.. అనేక మంది మృతి
మాస్కో కాన్సర్ట్​ హాల్​లో ఇస్లామిక్​ స్టేట్​ దాడి.. అనేక మంది మృతి (AP)

Moscow concert hall attack : రష్యా రాజధాని మాస్కో.. కాల్పుల మోతతో దద్దరిల్లింది. మాస్కోలోని ఓ కాన్సర్ట్​ హాల్​లోకి దూసుకెళ్లిన ఆగంతకులు.. కాల్పులకు తెగబడ్డారు. అనంతరం మొత్తం హాల్​కే నిప్పంటించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 60కి పెరిగింది. 100మంది గాయపడ్డారు. మాస్కోలో దాడి తమ పనేనని.. టెర్రర్​ గ్రూప్​ ఇస్లామిక్​ స్టేట్​ ఓ ప్రకటన విడుదల చేసింది. అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​.. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి, రష్యాపై మరింత పట్టు సాధించిన కొన్ని రోజులేక ఈ దాడి జరగడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

రష్యా మాస్కోలోని క్రోకస్​ సిటీ హాల్​లో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి జరిగింది ఈ ఘటన. రష్యాన్​ రాక్​ బ్యాండ్​ 'పిక్​నిక్​' ప్రదర్శనని చూసేందుకు ప్రజలు వెళ్లారు. ఇంతలో.. ఆగంతుకులు హాల్​లోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఆ ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. చివరికి.. పేలుడు పదార్థాలను కాన్సర్ట్​ హాల్​లోకి విసిరారు. ఆ తర్వాత.. కాన్సర్ట్​ హాల్​ రూఫ్​ కిందపడిపోయింది. ఇదొక భారీ ట్రాజడీ అని మాస్కో మేయర్​ సెర్గే సోబ్యానిన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆగంతకుల గురించి ప్రస్తుతం ఎలాంటి వివరాలు లేవు. వారు బతికే ఉన్నారా? లేక మాస్కో కాన్సర్ట్​ హాల్​ మంటల్లో చిక్కుకుని మరణించారా? అన్నది కూడా తెలియదు. అయితే.. రష్యా స్పెషల్​ ఫోర్స్​ వచ్చే ముందే.. దుండగులు అక్కడి నుంచి తప్పించుకున్నారు పలు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇదే నిజమైతే.. దుండగులు ప్రయాణించిన కారును పట్టుకునేందుకు అన్ని విధాలుగా కృషిచేస్తున్నట్టు అధికారులు చెప్పారు.

Moscow concert hall attack death toll : మాస్కో కాన్సర్ట్​ హాల్​పై దాడికి సంబంధించిన వివరాలను రష్యా అధ్యక్షుడు పుతిన్​కి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు అధికారులు.

మరోవైపు.. కాన్సర్ట్​ హాల్​లో కాల్పులకు సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఇద్దరు దుండగులు రైఫిల్స్​ పట్టుకుని హాల్​లో తిరుగుతున్న దృశ్యాలు ఓ వీడియోలో కనిపించాయి. ఇంకో వీడియోలో.. క్యాప్స్​ వేసుకుని, ముఖానికి మాస్క్​ ధరించి, చేతుల్లో రైఫిల్స్​ పట్టుకున్న నలుగురు ఆగంతకులు కనిపించారు. వారు కాల్పులకు తెగబడగా.. ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీస్తుండటం ఆ వీడియోల్లో రికార్డ్​ అయ్యింది.

మాస్కో కాన్సర్ట్​ హాల్​లో దాడి తమ పనేనని ఇస్లామిక స్టేట్​ ప్రకటించింది.

'క్రీస్టియన్స్​తో కూడిన భారీ సమూహంపై దాడి చేశాము,' అని ఓ ప్రకటన విడుదల చేసింది ఇస్లామిక్​ స్టేట్​. దీనిని అధికారులు ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది.

Moscow concert hall attack ISIS : రష్యాలో ఐస్లామిక్​ స్టేట్​ ప్రభావం ఇటీవలి కాలంలో పెరుగుతోంది. మార్చ్​ 7.. మాస్కోలోని ఓ యూదుల ప్రార్థనా మందిరంపై ఇస్లామిక్​ స్టేట్​ ప్లాన్​ చేసిన దాడిని పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని రోజుల క్రితమే.. ఆరుగురు ఐస్లామిక్​ స్టేట్​ సభ్యులను.. కౌకసస్​ ప్రాంతంలో కాల్చిచంపారు.

అయితే.. ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం జరుగుతుండటంతో.. ఉక్రెయిన్​ పాత్ర ఏమైనా ఉందా? అని అధికారులు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్​ పాత్ర ఉన్న తేలితే మాత్రం.. ఆ దేశంపై భారీ స్థాయిలో విరుచుకుపడతామని రష్యా భద్రతా మండలి డిప్యూటీ హెడ్​ దిమిత్రి మెద్వదేవ్​ తెలిపారు. కాగా.. ఉగ్రవాద మార్గాలను తాము ఎప్పడు ఉపయోగించలేదని, మాస్కో కాన్సర్ట్​ హాల్​పై దాడికి తమకు సంబంధం లేదని ఉక్రెయిన్​ చెప్పుకొచ్చింది.

WhatsApp channel

సంబంధిత కథనం