భారతీయుడితో మస్క్ 'ట్విట్టర్ దోస్తీ'.. రోజూ చాట్ చేసుకుంటారు!
Elon Musk | ఓ భారతీయుడు.. అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు ‘ట్విట్టర్ దోస్త్’. వాళ్లిద్దరు ఎప్పటికప్పుడు చాట్ చేసుకుంటారు! మస్క్‌తో మాట్లాడటం చాలా సింపుల్ విషయమని అతను అంటున్నాడు. ఆ భారతీయుడు కథేంటంటే..
Pranay Pathole Elon Musk | ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. ఎంతో బిజీ మనిషి అని అందరికి తెలిసిందే. మస్క్‌కు అభిమానులు, ఫాలోవర్ల సంఖ్య చాలా ఎక్కువే. ఆయనతో ఒక్కసారి మాట్లాడితే చాలు.. అనుకునే వారు చాలా మంది ఉంటారు. చాలా మంది కలలు కూడా కంటారు. అలాంటిది.. ఓ భారతీయుడితో మస్క్ తరచూ చాట్ చేస్తారని మీకు తెలుసా? అసలు మస్క్‌తో చాటింగ్ అనేది చాలా సింపుల్ విషయం అని ఆ వ్యక్తి అంటుంటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఇంతకీ ఆ భారతీయుడి కథేంటంటే..
2018 నుంచి చాటింగ్..
Elon musk twitter | ప్రనయ్ పథోలే అనే పుణెవాసి ప్రస్తుతం టీసీఎస్‌లో పనిచేస్తున్నాడు. అయితే 2018లోనే మస్క్‌కు ట్విట్టర్ దోస్త్‌గా మారిపోయాడు ప్రనయ్. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థిగా ఉన్నప్పుడు.. కార్లలో ఆటోమెటిక్ వైపర్లను టెస్లాలో వాడితే బాగుటుందని ప్రనయ్ భావించాడు. వెంటనే మస్క్‌ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. మస్క్ చూస్తే చాలు అనుకున్న ప్రనయ్కు షాక్ తగిలింది. ఆ ట్వీట్‌ను చూడటమే కాకుండా.. స్వయంగా మస్క్ ప్రనయ్కు రిప్లై ఇచ్చారు.
"ఆటోమెటిక్ వైపర్ల గురించి ఓ రెడ్డిట్ యూజర్ ఓ ప్రశ్న అడిగాడు. అది నాకు ఎంతో నచ్చింది. మస్క్‌కు ట్వీట్ చేద్దామా? అనిపించింది. రిప్లై ఇస్తే, టెస్లా కార్లలో వినియోగించుకోవచ్చేమో అనుకున్నా. కొన్ని నిమిషాలకే మస్క్ నుంచి ట్వీట్ వచ్చింది. ఆయన స్పందించారు. నేను అస్సలు నమ్మలేకపోయాను," అని ప్రనయ్ చెప్పుకొచ్చాడు.
@PPathole ట్విట్టర్ ఖాతాలో అన్నీ మస్క్ గురించే ఉంటాయి.
'మస్క్‌తో చాటింగ్.. చాలా సింపుల్ విషయం'
Pranay Pathole twitter | 'మస్క్ రిప్లై ఇచ్చినప్పుడు.. చాలా సంతోషంగా అనిపించింది. నా జీవితంలో అదే హైలైట్ అనుకున్నా. కానీ ఇప్పుడు మేము తరచూ మాట్లాడుకుంటాము. మస్క్‌తో చాటింగ్ చాలా సింపుల్ విషయంగా మారిపోయింది. ట్విట్టర్ డీఎం(డైరక్ట్ మెసేజ్)లలో మేము తరచూ చాట్ చేసుకుంటాము,' అని ప్రనయ్ అన్నాడు.
మరి అపర కుబేరుడితో చాటింగ్ ఎలా ఉంటుంది అని కొందరు అడిగిన ప్రశ్నకు సైతం ప్రనయ్ సమాధానం ఇచ్చాడు.
"మస్క్.. సూపర్ ఫ్రెండ్లీ. ప్రపంచ కుబేరుడితో మాట్లాడుతున్నట్టు అస్సలు అనిపించదు. నా వరకు అయితే.. మస్క్‌తో మాటలు.. ఓ స్నేహితుడితో సింపుల్‌గా చాట్ చేస్తున్నట్టు అనిపిస్తాయి. మస్క్ చాలా ఫ్రాంక్. ముక్కుసూటి మనిషి. ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటారు. నేను డీఎం చేసినప్పుడు కొన్ని నిమిషాల్లోనే రిప్లై ఇస్తారు," అని ప్రనయ్ స్పష్టం చేశాడు. సౌర కుటుంబం, మానవాళి మనుగడపై ప్రనయ్- మస్క్ మాట్లాడుకుంటారు.
ఇక మస్క్‌తో ప్రనయ్ చాట్ చేస్తాడని తెలిసి అతనికి ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఫాలోవర్లు వచ్చిపడ్డారు. మస్క్ గురించి చాలా మంది ప్రనయ్ను అడుగుతున్నారు.
2015లో స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 గురించి తొలిసారిగా తనకు తెలిసిందని, ఆ క్షణమే మస్క్‌కు ఫ్యాన్ అయిపోయానని ప్రనయ్ అన్నాడు. మస్క్ మీద చాలా పుస్తకాలు సైతం చదివానని వివరించాడు. ఏదో ఒకరోజు మస్క్‌తో కలిసి పనిచేయాలన్నదే తన లక్ష్యం అని ప్రనయ్ చెప్పుకొచ్చాడు.
"నేను యూఎస్‌లో మాస్టర్స్ కోసం ప్రయత్నిస్తున్నాను. మస్క్‌తో ఏదో ఒక రోజు కలిసి పనిచేయాలని నాకు ఉంది. మస్క్ సూపర్ ఇంటలిజెంట్. నాకు ఆయన మీద చాలా నమ్మకం ఉంది. మస్క్ ఏం చేసినా, కరెక్టే అని చాలా మంది భావిస్తారు. మస్క్‌తో కలిసి పనిచేయడం.. నా లాంటి యువకుడికి ఎంతో ఉపయోగపడుతుంది," అని ప్రనయ్ చెప్పుకొచ్చాడు.
సంబంధిత కథనం