Encounter: గడ్చిరోలి అడవుల్లో భారీ ఎన్ కౌంటర్; నలుగురు నక్సల్స్ మృతి-four naxalites killed in encounter with police in maharashtras gadchiroli ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Encounter: గడ్చిరోలి అడవుల్లో భారీ ఎన్ కౌంటర్; నలుగురు నక్సల్స్ మృతి

Encounter: గడ్చిరోలి అడవుల్లో భారీ ఎన్ కౌంటర్; నలుగురు నక్సల్స్ మృతి

HT Telugu Desk HT Telugu
Mar 19, 2024 03:47 PM IST

మహారాష్ట్రలోని గడ్చిరోలి అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారు జామున భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు నక్సలైట్లు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఏకే-47 రైఫిల్, ఒక కార్బైన్, స్థానికంగా తయారైన రెండు పిస్తోళ్లు, నక్సల్ సాహిత్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

మహారాష్ట్రలో ఎన్ కౌంటర్
మహారాష్ట్రలో ఎన్ కౌంటర్ (File)

Four Naxalites killed in encounter: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతాబలగాలతో మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో (encounter) నలుగురు నక్సలైట్లు చనిపోయారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో పోలీసులకు ఏకే-47 రైఫిల్, ఒక కార్బైన్, స్థానికంగా తయారైన రెండు పిస్తోళ్లు, నక్సల్ సాహిత్యం, ఇతర వస్తువులు లభ్యమయ్యాయి. రానున్న లోక్ సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో విద్రోహ చర్యలకు పాల్పడే లక్ష్యంతో కొందరు నక్సలైట్లు పొరుగున ఉన్న తెలంగాణ నుంచి ప్రాణహిత నదిని దాటి గడ్చిరోలిలోకి ప్రవేశించినట్లు సోమవారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందిందని ఎస్పీ నీలోత్ పాల్ తెలిపారు.

చనిపోయిన నక్సలైట్లు వీరే..

గడ్చిరోలి పోలీసుల ప్రత్యేక పోరాట విభాగం సీ-60, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్విక్ యాక్షన్ టీంకు చెందిన పలు బృందాలు మంగళవారం ఉదయం గడ్చిరోలి అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. రేపన్ పల్లి సమీపంలోని కోలామర్క పర్వతాల్లో సీ-60 యూనిట్ బృందం గాలింపు చేపడ్తుండగా.. వారిపై నక్సలైట్లు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని, దంతో, భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు (encounter) జరిపారని పోలీసు అధికారులు తెలిపారు. కాల్పులు ఆగిన తర్వాత ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టగా నలుగురు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయని, వారిపై రూ.36 లక్షల నగదు బహుమతి ఉందని తెలిపారు. వారి వద్ద నుంచి ఒక ఏకే-47 తుపాకీ, ఒక కార్బైన్, రెండు కంట్రీమేడ్ పిస్టల్స్, నక్సల్ సాహిత్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన నక్సలైట్లను వివిధ నక్సల్స్ కమిటీల కార్యదర్శులు వర్గీష్, మగ్తూ, ప్లాటూన్ సభ్యులు కుర్సాంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేష్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Whats_app_banner