Uttarkashi tunnel video : 10 రోజులుగా టన్నెల్ లోపలే ఉన్న కార్మికుల మొదటి దృశ్యాలు..
Uttarkashi tunnel video : ఉత్తరకాశీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులతో అధికారులు మాట్లాడారు. వారి వద్దకు కెమెరాను పంపించారు. 10 రోజుల తర్వాత.. కార్మికుల బంధువులు, తమ వారిని చూడగలిగారు!
Uttarkashi tunnel video : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో టన్నెల్ కూలిన ఘటనకు సంబంధించిన సహాయక చర్యలు 10వ రోజుకు చేరాయి. టన్నెల్ లోపల చిక్కుకున్న 41మంది కార్మికుల మొదటి దృశ్యాలను అధికారులు తాజాగా విడుదల చేశారు.
తొలిసారిగా వేడివేడి భోజనం..
ఈ నెల 12న.. ఉత్తరకాశీలో నిర్మాణ దశలో ఉన్న ఓ టన్నెల్ కూలింది. 41మంది కార్మికులు అప్పటి నుంచి అందులో ఉన్నారు. వారిని బయటకు తీసేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. సోమవారం రాత్రి, కార్మికులకు భోజనం అందించేందుకు.. 6 ఇంచ్‌ల పైప్‌ని లోపలికి పంపించారు. దానితో పాటు ఒక ఎండోస్కోపిక్ కెమెరాని కూడా పంపారు. లోపల ఉన్న కార్మికులను ఆ కెమెరా వీడియో తీసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Uttarkashi tunnel collapse latest news : కార్మికులు.. కెమెరావైపు చూసి చేతులు ఊపుతున్న దృశ్యాలు ఆ వీడియో చూడవచ్చు. తాము బాగానే ఉన్నామని, పరిస్థితులను తట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వారు చెప్పారు. అధికారులు.. వాకీ టాకీలతో కార్మికులతో మాట్లాడారు.
"మీరు కెమెరా ముందుకు వచ్చి, వాకీటాకీ ఉపయోగించి మాట్లాడండి," అని అధికారులు.. కార్మికులకు చెప్పిన మాటలు కూడా వీడియోలో రికార్డ్ అయ్యాయి.
మరోవైపు.. టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికులకు.. 10 రోజుల్లో తొలిసారిగా వేడివేడి భోజనం లభించింది. కిచిడీని బాటిళ్లల్లో పెట్టి పైప్‌ల ద్వారా పంపించారు అధికారులు. ఇప్పటివరకు.. వారు కేవలం డ్రై ఫ్రూట్స్, మంచి నీళ్లతోనే బతికారు!
Uttarkashi tunnel rescue : పైప్‌ల ద్వారా కార్మికులకు ఫోన్స్, ఛార్జర్లు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సహాయక చర్యలను పరిశీలిస్తున్న అధికారులు వెల్లడించారు.
అధికారులు తాజాగా విడుదల చేసిన వీడియో.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ట్విట్టర్లో షేర్ చేశారు. కార్మికులు ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు.
Uttarkashi tunnel latest news : 10 రోజుల తర్వాత.. కార్మికుల మొదటి దృశ్యాలను చూసిన వారి కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురైయ్యారు. "మాకు ఇంకా ఆశలు ఉన్నాయి. కానీ వారు బయకి వస్తేనే సంతృప్తి చెందుతాము," అని ఓ కార్మికుడి బంధువు వెల్లడించారు.
10 రోజులుగా ఉత్తరకాశీ టన్నెల్ లోపలే ఉన్న కార్మికుల మొదటి దృశ్యాలను ఇక్కడ చూడండి :
సంబంధిత కథనం