US Midterm elections : సెనేట్​లో ఆధిపత్యం.. మళ్లీ డెమొక్రాట్లదే- బైడెన్​ ఖుష్​!-democrats keep control of us senate as republicans face setbacks in crucial midterm polls ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Democrats Keep Control Of Us Senate As Republicans Face Setbacks In Crucial Midterm Polls

US Midterm elections : సెనేట్​లో ఆధిపత్యం.. మళ్లీ డెమొక్రాట్లదే- బైడెన్​ ఖుష్​!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 13, 2022 11:39 AM IST

Democrats keep control of US Senate : అమెరికా సెనేట్​లో ఆధిపత్యం మళ్లీ డెమొక్రాట్లకే లభించింది. ఈ విషయంపై జో బైడెన్​ హర్షం వ్యక్తం చేశారు.

బైడెన్​
బైడెన్​ (AP)

Democrats keep control of US Senate : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అనూహ్య ప్రదర్శనతో అందరిని ఆశ్చర్యపరిచిన డెమొక్రాట్లు.. సెనేట్​పై మరోమారు పట్టు సాధించారు. ఈ విషయాన్ని అమెరికా మీడియా సంస్థలు వెల్లడించాయి.

ట్రెండింగ్ వార్తలు

ఈ సీటుతో..

సాధారణంగా.. మధ్యంతర ఎన్నికల్లో అధికార పక్షం మెరుగైన ప్రదర్శన చేయడంలో విఫలమవుతుంది. ఈసారి కూడా ఇదే జరుగుతుందని అందరు భావించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలతో అల్లాడిపోతున్న ప్రజలు.. రిపబ్లికెన్లను గెలిపిస్తారని సర్వేలు కూడా చెప్పాయి. కానీ ఇలా జరగలేదు. రిపబ్లికెన్లు అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారు. అదే సమయంలో డెమొక్రాట్లు దూసుకెళ్లారు.

నెవాడాలో కీలకమైన సెనేట్​ స్థానంలో డెమొక్రాటిక్​ పార్టీకి చెందిన కాథెరిన్​ కార్టేజ్​.. రిపబ్లికెన్​ పార్టీ అభ్యర్థిపై స్పష్టమైన ఆధిక్యం సంపాదించినట్టు అమెరికా మీడియా శనివారం పేర్కొంది. ఫలితంగా డెమొక్రాట్లు సెనేట్​పై మళ్లీ పట్టు సాధించినట్టు అయ్యింది.

అమెరికా మధ్యంతర ఎన్నికలపై విశ్లేషణాత్మక కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

US Senate Democrats : సెనేట్​లో మొత్తం 100 సీట్లు ఉంటాయి. మధ్యంతర ఎన్నికలకు ముందు.. డెమొక్రాట్లు- రిపబ్లికెన్లు 50-50 సీట్లల్లో ఉండేవారు. అయితే.. డెమొక్రటిక్​ పార్టీకి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​కు ఒక విలువైన ఓటు ఉంది. ఇది డెమొక్రటిక్​ పార్టీకి కలిసి వచ్చే విషయం కాబట్టి.. సెనేట్​లో డెమొక్రాట్లకు పట్టు ఉంది. ఇక తాజా ఎన్నికల్లో.. కార్టేజ్​ గెలుపుతో.. సెనేట్​లో 50-49తో ఆధిపత్యంలోకి వచ్చింది డెమొక్రటిక్​ పార్టీ.

జార్జియాలో మరో సెనేట్​ సీటుకు డిసెంబర్​లో ఎన్నిక జరగనుంది.

US Midterm election results : ఇక ఈసారి ప్రతినిధుల సభకు కూడా ఎన్నికలు జరిగాయి. అక్కడ రిపబ్లికెన్లు స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ రిపబ్లికెన్లు గెలిచినా.. అనుకున్నంత మేర మెజారిటీ రాకపోవచ్చు. ఫలితంగా ఆధిపత్యం సాధించడంలో.. అటు సెనేట్​లో, ఇటు ప్రతినిధుల సభలో రిపబ్లికెన్లు విఫలమైనట్టే కనిపిస్తోంది.

తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం అని అభిప్రాయపడ్డారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం