Russia school shooting : స్కూల్​లో కాల్పుల కలకలం.. 13మంది మృతి!-at least six dead in russia school shooting attacker kills self officials ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Russia School Shooting : స్కూల్​లో కాల్పుల కలకలం.. 13మంది మృతి!

Russia school shooting : స్కూల్​లో కాల్పుల కలకలం.. 13మంది మృతి!

Sharath Chitturi HT Telugu

Russia school shooting : స్కూల్​లో కాల్పుల మోత మోగిన ఘటన రష్యాలో సోమవారం జరిగింది. ఈ ఘటనలో 13మంది మరణించగా.. మరో 20మంది గాయపడ్డారు.

రష్యా స్కూల్​లో కాల్పుల కలకలం..

Russia school shooting : రష్యా ఇజెవ్స్క్​ ప్రాంతంలోని ఓ స్కూల్​లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఏడుగురు మైనర్లు ఉన్నారు. రష్యా స్కూల్​లో కాల్పుల ఘటనలో 20మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

రష్యా స్కూల్​లో కాల్పులకు తెగబడిన దుండగుడు.. చివరికి ఆత్మహత్య చేసుకుని తన ప్రాణాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

Russia school shooting news : "స్కూల్​లో కాల్పులు జరిపిన ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నివేదికల ప్రకారం అతను ఆత్మహత్య చేసుకున్నాడు," అని ఓ అధికారి వెల్లడించారు.

రష్యా స్కూల్​లో కాల్పులకు తెగబడిన వ్యక్తి ఎవరు? అతను అసలు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు? అన్న వివరాలు తెలియరాలేదు.

Russia school shooting today : అయితే.. దుండగుడు నలుపు రంగు షర్ట్​ వేసుకున్నట్టు, దాని మీద 'నాజీ' చిహ్నం ఉన్నట్టు తెలుస్తోంది.

రష్యా స్కూల్​లో కాల్పుల ఘటనపై ఆ ప్రాంత గవర్నర్​ అలెగ్జాండర్​ బ్రెచలోవ్​ స్పందించారు. మృతులు, గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారని వెల్లడించారు.

ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అంబులెన్సులు, స్ట్రెచర్లతో లోపలికి వెళ్లి, మనుషులను ఎక్కించుకుని ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. మొత్తం మీద 13మంది మరణించినట్టు.. వీరిలో ఆరుగురు పెద్దలు, ఏడుగురు మైనర్లు ఉన్నట్టు తెలుస్తోంది. 14 చిన్నారులు, ఏడుగురు పెద్దలు తీవ్రంగా గాయపడ్డారు.

Russia school shooting : ఇజెవ్స్క్​లో 6,30,000 మంది నివాసముంటున్నారు. రష్యాలోని ఉడ్​ముర్ట్​ రాజధాని ఈ ఇజెవ్స్క్. మాస్కో నుంచి 1,000కి.మీల దూరంలో ఉంది ఈ ప్రాంతం.

రష్యా స్కూళ్లల్లో కాల్పుల ఘటనలు 2021 వరకు చాలా అరుదుగా ఉండేవి. కానీ 2021 నుంచి ఈ తరహా ఘటనలు ఆందోళనకర రీతిలో పెరిగాయి. ఇక ఉల్యనోవెస్క్​ ప్రాంతంలోని ఓ స్కూల్​లో ఏప్రిల్​లో జరిగిన కాల్పుల ఘటనలో ఓ టీచర్​, ఇద్దురు చిన్నారులు మరణించారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.