Arun Goel appointed as Election Commissioner: కొత్త ఎలక్షన్ కమిషనర్ నియామకం-arun goel appointed as election commissioner by president droupadi murmu ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Arun Goel Appointed As Election Commissioner: కొత్త ఎలక్షన్ కమిషనర్ నియామకం

Arun Goel appointed as Election Commissioner: కొత్త ఎలక్షన్ కమిషనర్ నియామకం

HT Telugu Desk HT Telugu
Nov 19, 2022 08:30 PM IST

New Election Commissioner Arun Goel: మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ ను కొత్త ఎలక్షన్ కమిషనర్ గా రాష్ట్రపతి నియమించారు.

కొత్త ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్
కొత్త ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్

New Election Commissioner Arun Goel: నూతన ఎన్నికల కమిషనర్ గా మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి ఆయన నియామకం అమలులోకి వస్తుందని కేంద్ర న్యాయ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

Punjab cadre IAS officer: పంజాబ్ కేడర్ ఐఏఎస్ అధికారి

అరుణ్ గోయల్ 1985 బ్యాచ్ పంజాబ్ కేడర్ ఐఏఎస్ అధికారి. పంజాబ్ లో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. గత సంవత్సరం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. నిజానికి ఆయన 2022 డిసెంబర్ 31న రిటైర్ కావాల్సి ఉండగా, ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.

New Election Commissioner Arun Goel: సీఈసీ రాజీవ్ కుమార్ టీమ్ లో..

ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల అధికారిగా రాజీవ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. మరో కమిషనర్ గా అనూప్ చంద్ర పాండే ఉన్నారు. ఈ టీమ్ లో మరో ఎలక్షన్ కమిషనర్ గా అరుణ్ గోయల్ చేరనున్నారు. 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల వరకు వివిధ రాష్ట్రాల్లో వరుసగా ఎన్నికలున్నాయి.

Whats_app_banner