Gujarat forms panel for Uniform Civil Code: గుజరాత్ లోనూ ఉమ్మడి పౌర స్మృతి!-ahead of polls gujarat forms panel to implement uniform civil code ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gujarat Forms Panel For Uniform Civil Code: గుజరాత్ లోనూ ఉమ్మడి పౌర స్మృతి!

Gujarat forms panel for Uniform Civil Code: గుజరాత్ లోనూ ఉమ్మడి పౌర స్మృతి!

HT Telugu Desk HT Telugu
Oct 29, 2022 05:54 PM IST

Gujarat forms panel for Uniform Civil Code: ఉమ్మడి పౌర స్మృతి.. Uniform Civil Code.. దశాబ్దాలుగా బీజేపీ ప్రచార నినాదం. ఎన్నికల హామీ. అయోధ్యలో రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు తో పాటు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చాన్నాళ్లు కొనసాగిన అంశం ఈ ఉమ్మడి పౌర స్మృతి.. Uniform Civil Code.

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్

Gujarat forms panel for Uniform Civil Code: తాజాగా, ఈ ఉమ్మడి పౌర స్మృతి(Uniform Civil Code) మరోసారి తెరపైకి వచ్చింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలలు జరగనున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం ఈ Uniform Civil Codeని తెరపైకి తెచ్చింది.

Gujarat forms panel for Uniform Civil Code: 2019లో బీజేపీ హామీ

అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఈ ఉమ్మడి పౌర స్మృతి(Uniform Civil Code)ని అమలు చేస్తామని బీజేపీ 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఇదే విషయాన్ని పార్టీ మేనిఫెస్టోలోనూ పొందుపర్చింది. మైనారిటీలకు ఈ ఉమ్మడి పౌర స్మృతి(Uniform Civil Code) వ్యతిరేకమన్న వాదన ఉంది. మతపరమైన ప్రత్యేక చట్టాలతో ఇన్నాళ్లు తాము పొందుతున్న రక్షణను ఈ ఉమ్మడి పౌర స్మృతి(Uniform Civil Code) తొలగిస్తుందన్న భావన మైనారిటీల్లో ఉంది. Uniform Civil Codeని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు కూడా తెలిపింది.

Gujarat forms panel for Uniform Civil Code: అమలుకు కమిటీ

మతాలకు అతీతంగా అందరికీ ఒకే చట్టం అనే సూత్రం ఆధారంగా ఈ ఉమ్మడి పౌర స్మృతి(Uniform Civil Code) భావన రూపొందింది. గుజరాత్ లోనూ దీన్ని అమలు చేయడం కోసం ప్రభుత్వం శనివారం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మైనారిటీలకు ఈ ఉమ్మడి పౌర స్మృతి(Uniform Civil Code) వ్యతిరేకమన్న వాదన ఉంది. మతపరమైన ప్రత్యేక చట్టాలతో ఇన్నాళ్లు తాము పొందుతున్న రక్షణను ఈ ఉమ్మడి పౌర స్మృతి(Uniform Civil Code) తొలగిస్తుందన్న భావన మైనారిటీల్లో ఉంది.ని అమలు చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శనివారం ప్రకటించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల పోలరైజేషన్ లక్ష్యంగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Gujarat forms panel for Uniform Civil Code: మూడో రాష్ట్రం

ఉమ్మడి పౌర స్మృతి(Uniform Civil Code) అమలు చేస్తున్న మూడో రాష్ట్రంగా గుజరాత్ నిలవనుంది. ఇప్పటివరకు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో ఈదిశగా చర్యలు తీసుకున్నాయి. ఈ రెండు రాష్ట్రాలు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం విశేషం.

Whats_app_banner