West Bengal crime news : బెంగాల్​లో దారుణం- ఇద్దరు మహిళలను అర్ధ నగ్నంగా చేసి.. ఊరేగించి!-afte manipur video 2 women beaten paraded half naked in west bengals malda ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  West Bengal Crime News : బెంగాల్​లో దారుణం- ఇద్దరు మహిళలను అర్ధ నగ్నంగా చేసి.. ఊరేగించి!

West Bengal crime news : బెంగాల్​లో దారుణం- ఇద్దరు మహిళలను అర్ధ నగ్నంగా చేసి.. ఊరేగించి!

Sharath Chitturi HT Telugu
Jul 22, 2023 11:12 AM IST

West Bengal crime news : పశ్చిమ్​ బెంగాల్​లో మణిపూర్​ తరహా ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలను కొందరు అర్ధ నగ్నంగా చేసి.. కొడుతూ, ఊరేగించారు. అసలేం జరిగిందంటే..

ఇద్దరు మహిళలను అర్ధ నగ్నంగా చేసి.. ఊరేగించి!
ఇద్దరు మహిళలను అర్ధ నగ్నంగా చేసి.. ఊరేగించి!

West Bengal crime news : మణిపూర్​లో ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి ఊరేగించిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కొన్ని రోజులకే.. అదే తరహా ఘటన ఒకటి పశ్చిమ్​ బెంగాల్​లో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను అర్ధ నగ్నంగా చేసిన కొందరు.. వారిని కొడుతూ, ఊరేగింపుగా తీసుకెళ్లారు!

ఇదీ జరిగింది..

సంబంధిత ఘటన బెంగాల్​లోని మాల్దా జిల్లాకు చెందిన పఖౌహట్​ గ్రామంలో మూడు- నాలుగు రోజుల క్రితం జరిగినట్టు తెలుస్తోంది. ఇద్దరు మహిళలు దొంగతనానికి పాల్పడుతున్నారన్న అనుమానంతో గ్రామస్థులు వారిని పట్టుకుని దారుణంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

women paraded half naked in West Bengal : అనంతరం ఆ ఇద్దరు మహిళలను అక్కడి స్థానికులు అర్ధ నగ్నంగా చేశారు. స్థానికుల్లో చాలా మంది మహిళలే ఉండటం గమనార్హం. ఆ తర్వాత వారిని కొడుతూ, ఊరేగింపుగా తీసుకెళ్లారు.

ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. వీడియో చూసిన తర్వాతే తమకు ఘటన గురించి తెలిసిందని అన్నారు.

"మా వద్దకు వచ్చి ఎవరు ఫిర్యాదు చేయలేదు. వైరల్​ వీడియో చేసిన తర్వాతే.. మాకు ఈ విషయం గురించి తెలిసింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఇద్దరు మహిళలు దొంగతనానికి పాల్పడుతుండగా.. దుకాణంలోని ఓ మహిళ వారిని పట్టుకుంది. అనంతరం రోడ్డు మీదకు తీసుకొచ్చింది. స్థానికులు ఆ మహిళలపై దాడి చేశారు. కొందరు మహిళలు.. వారిద్దరిని అర్ధ నగ్నంగా చేసి కొట్టారు. కొద్ది సేపటి తర్వాత బాధితులు అక్కడి నుంచి పారిపోయారు. వారి నుంచి మాకు ఫిర్యాదు అందలేదు. దుకాణదారులు కూడా ఫిర్యాదు చేయలేదు," అని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:- Manipur video : మణిపూర్​లో మరో దారుణం.. వ్యక్తి తల నరికి, వేలాడదీసి!

కాగా.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి, సంబంధిత వ్యక్తులపై సరైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

మణిపూర్​లో..

మణిపూర్​లో మే 4న ఇద్దరు మహిళలపై కొందరు దాడి చేశారు. వారిని నగ్నంగా చేసి, ఊరేగించారు. బాధితుల్లో ఒకరిపై రేప్​ జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవలే సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తున్నారు.

Manipur video parade : కాగా.. మణిపూర్​ వీడియోలోని ఓ మహిళ భర్త.. భారత సైన్యంలోని అసోం రెజిమెంట్​లో సుబేదార్​గా పనిచేశారు. కార్గిల్​ యుద్ధంతో పాటు శ్రీలంకలో ఇండియన్​ పీస్​ కీపింగ్​ ఫోర్స్​లో విధులు నిర్వహించారు. కానీ ఇప్పుడు తన భార్యను కాపాడుకోలేకపోయానని కన్నీరు పెట్టుకుంటున్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం