Bengaluru rains : ‘సగం నగరం మునిగిపోయింది’- బెంగళూరు వర్షాలకు ప్రజలు విలవిల..-50 of bengaluru underwater rains return flooding strikes amid yellow alert ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru Rains : ‘సగం నగరం మునిగిపోయింది’- బెంగళూరు వర్షాలకు ప్రజలు విలవిల..

Bengaluru rains : ‘సగం నగరం మునిగిపోయింది’- బెంగళూరు వర్షాలకు ప్రజలు విలవిల..

Sharath Chitturi HT Telugu
Oct 20, 2024 09:58 AM IST

బెంగళూరులో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

బెంగళూరులో భారీ వర్షాలు..
బెంగళూరులో భారీ వర్షాలు.. (PTI)

కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు మరోసారి ముంచెత్తాయి. గత వారం మొదట్లో కురిసిన భారీ వర్షాలకు ఇంకా కోలుకోని నగరంపై శనివారం మరింత భారం పడింది! ఫలితంగా బెంగళూరు నగరంలోని చాలా చోట్ల ట్రాఫిక్​ స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.

శనివారం రాత్రి 8.30 గంటల సమయానికి బెంగళూరు నగరంలో 17.4 మిల్లీమీటర్లు, హెచ్ఏఎల్​లో 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదించింది.

ఆదివారం కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల గురించి ప్రజలను హెచ్చరిస్తూ బెంగళూరుకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.

ఇక శనివారం కురిసిన వర్షాలకు రాజరాజేశ్వరి నగర్, కెంగేరి, హెబ్బాల్​ జంక్షన్, నాగవారా, హోరమావు, హెన్నూరు, కస్తూరి నగర్, రామమూర్తి నగర్, విండ్సర్ మానర్ అండర్పాస్-మెహ్క్రీ సర్కిల్, ఔటర్ రింగ్ రోడ్డు వంటి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

వరదల తీవ్రతపై చాలా మంది బెంగళూరు వాసులు సోషల్​ మీడియా వేదికపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు.

"బెంగళూరులో 50 శాతం ఈ రోజు నీటిలో ఉందని నేను అనుకుంటున్నాను," అని ఒకరు వ్యాఖ్యానించారు. "ఫ్లాట్​, బూడిద రంగు ఆకాశం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం సూర్యుడు మళ్లీ ప్రకాశిస్తాడా? అని ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది," అని మరొక ఎక్స్ యూజర్ అన్నారు.

రాజరాజేశ్వరి నగర్, కెంగేరి నివాసితులు తమ పరిసరాల్లోని వీధుల్లో వరదకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

బెంగళూరు వర్షాలపై సోషల్​ మీడియాలో వైరల్​ పోస్టులను ఇక్కడ చూడండి:

బెంగళూరు అంతటా నీరు నిలిచిపోవడం, నెమ్మదిగా రాకపోకలు సాగించడం, ఇరువైపులా వరదలు రావడంతో విమానాశ్రయానికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సీబీడీ)లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపించింది.

బెంగళూరులో అక్టోబర్ 16 నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలకు రెండు రోజుల విరామం తర్వాత అక్టోబర్ 19న నగరం మళ్లీ జలమయం కావడంతో పాటు రోజువారీ జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితి, మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సహాయక చర్యలకు సహాయపడటానికి విపత్తు ప్రతిస్పందన బృందాలను రంగంలోకి దింపారు.

రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం..

మరోవైపు బంగాళాఖాతంలో అక్టోబర్ 21వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇది వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఉరుములతో కూడన వానలు పడనున్నాయి. నైరుతి మరియు అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాత ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది. ఇదే కాకుండా మరో ఉపరితల ఆవర్తనం మధ్య అండమాన్ సముద్ర ప్రాంతంలో విస్తరించి ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం