AP Telangana Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్, ఆవర్తనం ప్రభావంతో రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
AP Telangana Rains : ఈ నెల 22 నాటికి బంగాళాఖాళంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 24 నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 6)
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అక్టోబరు 22(మంగళవారం) నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి అక్టోబర్24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందంది. ఎటు వెళ్తుంది అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని తెలిపింది.
(2 / 6)
అక్టోబర్ 20న ఈ జిల్లాల్లో వర్షాలు
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
(3 / 6)
అక్టోబర్ 20న ఈ జిల్లాల్లో వర్షాలు
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
(4 / 6)
పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీరప్రాంతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో ఉపరితల ఆవర్తనం మధ్య అండమాన్ సముద్ర ప్రాంతంలో సగటు సముద్ర మట్టంనకు 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది పేర్కొంది.
(5 / 6)
అక్టోబరు 22న తూర్పు మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతములో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ అక్టోబర్ 24 తేదీన వాయుగుండంగా బలపడే అవకాశముందని వెల్లడించారు. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా అల్పపీడన ప్రాంతం నుంచి ఉపరితల ద్రోణి దక్షిణ కర్ణాటక, రాయలసీమ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది.
ఇతర గ్యాలరీలు