IND vs NZ 1st Test Day 5 Rain: తొలి టెస్టు చివరి రోజు వాన పడే అవకాశాలు ఎంత? టీమిండియాను వర్షం కాపాడుతుందా?
- IND vs NZ 1st Test Day 5 Rain: తొలి టెస్టులో న్యూజిలాండ్‍కు భారత్ స్వల్ప లక్ష్యాన్ని ఇచ్చింది. అయితే, ఈ మ్యాచ్ చివరి రోజైన రేపు (అక్టోబర్ 20) వాన ఆటకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇవే..
- IND vs NZ 1st Test Day 5 Rain: తొలి టెస్టులో న్యూజిలాండ్‍కు భారత్ స్వల్ప లక్ష్యాన్ని ఇచ్చింది. అయితే, ఈ మ్యాచ్ చివరి రోజైన రేపు (అక్టోబర్ 20) వాన ఆటకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇవే..
(1 / 6)
న్యూజిలాండ్‍తో తొలి టెస్టులో భారత్ కష్టాల్లో ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో న్యూజిలాండ్ ముందు కేవలం 107 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే టీమిండియా ఉంచింది. రేపు (అక్టోబర్ 20) ఐదో రోజైన చివరి రోజు ఆట జరగనుంది. (PTI)
(2 / 6)
సర్ఫరాజ్ ఖాన్ (150) తన తొలి టెస్టు సెంచరీతో దుమ్మురేపడం సహా రిషబ్ పంత్ (99) అదరగొట్టడంతో న్యూజిలాండ్‍తో తొలి టెస్టులో భారత్ పుంజుకుంది. అయితే, నాలుగో రోజైన నేడు చివరి 7 వికెట్లను 54 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. 462 పరుగులకే ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్ ముందు 107 పరుగుల టార్గెట్ ఉంది. (BCCI - X)
(3 / 6)
ఈ తొలి టెస్టు చివరి రోజు రేపు ఆటకు వరుణుడు ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది. వాన పడి ఐదో రోజు ఆట జరగకపోతే డ్రాతో భారత్ గట్టెక్కే అవకాశాలు ఉంటాయి. ఆట జరిగితే న్యూజిలాండ్‍ను 107 పరుగులు చేయకుండా అడ్డుకోవడం కష్టమే అవుతుంది. మరి రేపు వాన పడే అవకాశాలు ఎంత ఉన్నాయంటే..(AFP)
(4 / 6)
అక్యువెదర్ ప్రకారం, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద రేపు (అక్టోబర్ 20) ఉదయం 9, 10 గంటలకు వర్షం పడే అవకాశం 51 శాతంగా ఉంది. ఆ తర్వాత రెండు గంటలు వాన పడే అవకాశాలు 49 శాతంగా ఉన్నాయి. (AFP)
(5 / 6)
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు వర్షం పడే ఛాన్సులు 50 శాతానికి పైగా ఉన్నాయి. ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల వరకు 40 శాతంలోపుగా ఉన్నాయి. మొత్తంగా రేపు బెంగళూరు స్టేడియం వద్ద వాన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఆటకు ఏ మాత్రం ఆటంకాలు కలుగుతాయో చూడాలి. (AFP)
(6 / 6)
ఈ తొలి టెస్టు గెలువాలంటే న్యూజిలాండ్ 107 పరుగులు చేయాలి. అన్ని వికెట్లు చేతిలో ఉన్నాయి. భారత్ గెలువాలంటే ఆలోగానే కివీస్‍ను ఔట్ చేయాలి. అయితే, ఇది కష్టంతో కూడుకున్న పనే. ఒకవేళ రేపు ఐదో రోజు ఆట వాన వల్ల ఎక్కువగా సాధ్యం కాకపోతే మ్యాచ్ డ్రా అవుతుంది. మరి టీమిండియాను ఓటమి నుంచి వర్షం కాపాడుతుందేమో చూడాలి.(PTI)
ఇతర గ్యాలరీలు