Cotton In Nose : చనిపోయిన వారి ముక్కులో పత్తి ఎందుకు పెడతారు?-why do put cotton in nose after death heres reasons ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cotton In Nose : చనిపోయిన వారి ముక్కులో పత్తి ఎందుకు పెడతారు?

Cotton In Nose : చనిపోయిన వారి ముక్కులో పత్తి ఎందుకు పెడతారు?

Anand Sai HT Telugu
Dec 29, 2023 09:30 AM IST

After Death : చనిపోయిన తర్వాత కొన్ని ఆచారాలు ఉంటాయి. అందులో భాగంగా ముక్కు, చెవిలో పత్తి పెట్టడం చూస్తుంటాం. ఇలా ఎందుకు చేస్తారు?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

చనిపోయిన వ్యక్తి ముక్కు, చెవులు పత్తితో నింపడం మనందరం చూశాం. ఇలా ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనక కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం. హిందూ మతంలో మరణించిన వారి కుటుంబ సభ్యులతో దహన సంస్కారాలు నిర్వహిస్తారు. అంత్యక్రియలకు ముందు చేయవలసినవి, చేయకూడనివి కొన్ని ఉంటాయి. అలాగే అంత్యక్రియల తర్వాత పాటించవలసినవి ఫాలో అవ్వాలి.

అదేవిధంగా మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలను కూడా పురాణాలు పేర్కొంటున్నాయి. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన అనంతరం మృతుడి కుటుంబీకులు కొందరు పూజలు కూడా చేస్తారు. ఇది కొంతమంది ఆచారం. మరో నియమం కూడా ఉంది. చనిపోయిన వ్యక్తి ముక్కు, చెవులలో పత్తిని ఉంచడం. ఇలా చేసేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.

దీని వెనుక శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయని మీరు తెలుసుకోవాలి. ముందుగా శాస్త్రీయ కారణాన్ని చూద్దాం. నిజానికి మరణం తర్వాత ఒక వ్యక్తి చెవులు, ముక్కు నుండి ఒక ప్రత్యేక ద్రవం బయటకు వస్తుంది. ఈ ద్రవం ప్రవాహాన్ని ఆపడానికి ఇలా పత్తిని పెడతారు. దీంతో పాటు మరణానంతరం శరీరంలోకి ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా ముక్కు రంధ్రాలు, చెవులను దూదితో కప్పి ఉంచుతారని అంటారు. దీని వలన శరీరం త్వరగా పాడైపోకుండా ఉంటుందని చెబుతారు.

ఇప్పుడు దీని వెనక ఉన్న ఆధ్యాత్మికత ఏంటో చూద్దాం. మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి కలగాలని ముక్కు దగ్గరలో చిన్న బంగారు ముక్కలను ఉంటేవారట. ముక్కలు కింద పడకుండా ఉండేందుకు వాటి ముందు పత్తిని ఉంచేవారు. ముక్కులో దూది పెట్టుకోవడానికి ఇది కూడా ఓ కారణమని పెద్ద చెబుతారు. అయితే చనిపోయిన వ్యక్తి తనతో ఏమీ తీసుకుపోలేడు. చనిపోయిన వ్యక్తికి ప్రాపంచిక విషయాలతో సంబంధం లేదని గరుడ పురాణం పేర్కొంది. కాలక్రమేణా చనిపోయిన వ్యక్తి ముక్కు, చెవి లేదా ఇతర భాగాలపై బంగారు ముక్కలను ఉంచడం లేదు. ఒకవేళ శరీరం మీద ఉంటే.. దహన సంస్కారాల ముందు తీసి వేస్తారు. ఇది కూడా ఇంటి ఆడ బిడ్డలకు ఇస్తారు. చనిపోయిన వ్యక్తి గుర్తుగా దాచి పెట్టుకుంటారు.

ముక్కు లేదా చెవులపై దూది పెట్టడం వెనుక మరో కథ కూడా ఉంది. దీని ప్రకారం మరణం తర్వాత యమధర్మరాజు ఒకరి ఆత్మను అతని శరీరం నుండి వేరు చేస్తాడు. ఆత్మ తిరిగి శరీరంలోకి ప్రవేశించే మార్గాన్ని కనుగొంటుంది. అటువంటి పరిస్థితిలో మళ్ళీ లోపలికి రాకుండా ఉండటానికి ముక్కు, చెవులలో పత్తిని ఉంచుతారని కథ ఉంది.

టాపిక్