Cholesterol-Lowering Fruits | ఈ 5 రకాల పండ్లు రోజూ తింటే, కొవ్వు కరిగిపోతుందంతే!-these are the best fruits to help lowering elevated cholesterol ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cholesterol-lowering Fruits | ఈ 5 రకాల పండ్లు రోజూ తింటే, కొవ్వు కరిగిపోతుందంతే!

Cholesterol-Lowering Fruits | ఈ 5 రకాల పండ్లు రోజూ తింటే, కొవ్వు కరిగిపోతుందంతే!

HT Telugu Desk HT Telugu
Sep 14, 2022 08:57 PM IST

అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి కొవ్వును కరిగించుకోవడం చాలా ముఖ్యం. అయితే కొన్ని పండ్లు అధిక కొలెస్ట్రాల్ సమస్యను దూరం చేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

best fruits to help lowering elevated cholesterol
best fruits to help lowering elevated cholesterol (Unsplash)

అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బందిపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇదొక శారీరక అవస్థ. పొట్ట, పిరుదులు, నడుము భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది. కానీ శరీరాకృతి మారేంత వరకు లేదా బరువు పెరిగే వరకు ఈ సమస్య మన దృష్టికి రాదు. ప్రధానంగా తినే ఆహారం, నిశ్చలమైన జీవనశైలి కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ పరిస్థితిని వీలైనంత త్వరగా సవరించుకోకపోతే ఇది అనేక అనారోగ్య సమస్యలకు కలిగిస్తుంది. గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక రుగ్మతలకు దారితీయవచ్చు.

శరీరంలో కొలెస్ట్రాల్ అధికమైనపుడు కొన్ని లక్షణాలను అనుభవిస్తాము. తరచుగా వికారం, అధిక రక్తపోటు, ఛాతీలో భారం, బరువు పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన అలసట.. ఇవన్నీ అధిక కొలెస్ట్రాల్ లక్షణాలే. ఇవి మీరు గుర్తిస్తే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అలాగే కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు సమతుల్యమైన ఆహారంతో పాటు ఐదు రకాల పండ్లను తింటే అధిక కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

టొమాటో

టొమాటో మనం కూరగాయగా పరిగణిస్తున్నప్పటికీ ఇది ఒక పండు కూడా. టొమాటోలో విటమిన్లు ఎ, బి, సి ఇంకా కె ఉన్నాయి. ఇవి అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. టొమాటోలు తినడం ద్వారా గుండెకు కూడా మేలు కలుగుతుంది.

బొప్పాయి

బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆకస్మిక గుండెపోటును నివారించాలంటే పచ్చి బొప్పాయిని ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉండాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బొప్పాయిలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ చాలా ఉన్నాయి. బొప్పాయి తినడం ద్వారా విటమిన్లు బి, సి, ఇ లభిస్తాయి. అలాగే పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం వంటి కీలక మూలకాలు శరీరానికి అందుతాయి.

అవకాడో

కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడానికి అవకాడోను సమృద్ధిగా తినాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది , స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒక మీడియం సైజ్ అవోకాడోలో 96 కేలరీలు, 6 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వు, 4 గ్రాముల ఫైబర్ ఉంటాయి.

సిట్రస్ ఫలాలు

నారింజ, నిమ్మ, బత్తాయి, గ్రేప్‌ఫ్రూట్ (ద్రాక్ష కాదు) వంటి పండ్లు సిట్రస్ పండ్ల జాబితాలోకి వస్తాయి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇవి ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడతాయి. ఇలాంటి పండ్లు తింటే చర్మం, జుట్టు సంరక్షణ కూడా బాగుంటుంది.

పుచ్చకాయ

పుచ్చకాయ ఒక రిఫ్రెషింగ్ పండు. డైటీషియన్ల ప్రకారం, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. పుచ్చకాయలో లైకోపీన్, కెరోటినాయిడ్ వంటి సమ్మేళనాలు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేస్తుంది, తద్వారా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి కొవ్వును కరిగించుకోవడం చాలా ముఖ్యం. అంతే కాదు కూరగాయల్లో క్యారెట్ ఎక్కువగా తినడం వల్ల గుండెకు చాలా మంచిది. క్యారెట్ తినడం వల్ల బ్లడ్ ప్రెజర్, బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇది కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. క్యారెట్ జ్యూస్ లేదా పచ్చి క్యారెట్ ఉదయం, సాయంత్రం తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్