Urine Holding Problems : ఇంటికెళ్లి పోద్దామని మూత్రం ఆపుకొంటున్నారా? అయితే సమస్యలే-side effects of holding in urine for too long ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Side Effects Of Holding In Urine For Too Long

Urine Holding Problems : ఇంటికెళ్లి పోద్దామని మూత్రం ఆపుకొంటున్నారా? అయితే సమస్యలే

HT Telugu Desk HT Telugu
Feb 10, 2023 12:44 PM IST

Side Effects of Urine Holding : కొంతమంది మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకొంటారు. ఇంటికి వెళ్లాక పోద్దాంలేనని పట్టించుకోరు. కానీ ఆలోచన మాత్రం దాని మీదనే ఉంటుంది. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా ?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

చాలా మంది పబ్లిక్ టాయిలెట్ల(Public Toilets)లో మూత్ర విసర్జన చేయడం, బహిరంగ ప్రదేశాల్లో వాష్‌రూమ్‌లను ఉపయోగించడం మానుకుంటారు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన(Urine) చేయడం తప్పే. కానీ పబ్లిక్ టాయిలెట్లను వాడుకుంటే అయిపోద్ది. మూత్రం ఎక్కువగా ఆపుకోవడం వలన అనేక సమస్యలు వస్తాయ్. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.

పరిశుభ్రత అంటూ.. బయట వెళ్లకుండా మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుతారు. ఇంటికి చేరుకున్న తర్వాత బాత్రూమ్‌(Bathroom)కు వెళ్లాలని అనుకుంటారు. సరే కొన్ని సమయాల్లో మూత్రాన్ని ఆపుకొంటారు. కానీ మీరు దీన్ని అతిగా చేస్తే.. మీకు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు(Urine Infections), మూత్రాశయం సాగడం, మూత్రపిండాల్లో రాళ్లు(Kidney Stones) వంటి ఆరోగ్య సమస్యలు రావొచ్చు. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపితే.. మూత్రపిండాలలో నొప్పిని అనుభవించవచ్చు. మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పిని కూడా చూడొచ్చు. మూత్రాన్ని ఆపుకోవడమంటే.. కండరాల మీద ఒత్తిడి పెట్టినట్టే.

మూత్రం ఎక్కువసేపు ఉంచడం వల్ల బ్యాక్టిరియా(bacteria) అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ దారితీయవచ్చు. బ్యాక్టిరియా మీ మూత్ర నాళం ద్వారా వ్యాపిస్తుంది. మూత్రంలో రక్తం కనిపించడం, మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించడం, నిరంతరంగా మూత్ర విసర్జన చేయవలసి రావడం, రంగు మారిన మూత్రం, దుర్వాసనతో కూడిన మూత్రం, పొత్తికడుపు ప్రాంతంలో నొప్పి రావొచ్చు. తక్కువ నీరు తాగే వ్యక్తులు ఇలాంటి పరిస్థితులకు ఎక్కువగా గురవుతారు

మీరు ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకొంటే.. మూత్రపిండాల్లో రాళ్లు పెరగొచ్చు. ఇది నొప్పికి కారణమవుతుంది. రాళ్లను తొలగించడానికి మీకు శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు. తక్కువ నీరు(Water) తాగేవారిలో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి.

మీరు నిరంతరం మూత్రాన్ని ఆపుకొంటే.. మీ మూత్రాశయం విస్తరించవచ్చు. ఎప్పుడూ ఇదే చేస్తే.. మూత్రాశయం పరిమాణం మీద ప్రభావం ఉంటుంది. దీంతోపాటుగా మూత్రం పోసేప్పుడు కూడా ఇబ్బంది పడతారు. ఎక్కువ సమయం పాటు మూత్రాన్ని పట్టుకోవడం చాలా సమస్యలకు దారితీస్తుంది.

కొన్నిసార్లు మూత్రవిసర్జనలో చేయడం కష్టం కావొచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితి తప్పదు. అయితే దీనిద్వారా సమస్యలు వస్తాయి.. కాబట్టి.. మెదడును వేరే వైపు ఆలోచన చేసేలా చేయాలి. సంగీతాన్ని వినడంలాంటివి చేయాలి. ఖాళీగా ఉంటే అదే ఆలోచన వస్తుంది. మీరు కూర్చున్నట్లయితే కూర్చునే ఉండాలి. చలితో మూత్ర విసర్జన చేయాలనేది పెరుగుతుంది.. కాబట్టి మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.

ఎప్పుడో ఒకసారి మూత్రం ఆపుకోవడం ఏం కాదు. కానీ క్రమం తప్పకుండా అలా చేయడం సమస్యనే. మూత్రపిండ సమస్యలు ఉంటే ఇది చాలా ప్రమాదం. గర్భిణీలు(Pregnant) మూత్రం ఆపుకోవడం మాత్రం.. అస్సలు చేయోద్దు.

WhatsApp channel