Monday Motivation: ఏడ్వడం అనేది ఓ ఎమోషన్.. దాన్ని వీక్​నెస్​గా తీసుకోకండి..-monday motivation never think you are weak if you cry every tear is replaced with wisdom and strength ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Monday Motivation Never Think You Are Weak If You Cry. Every Tear Is Replaced With Wisdom And Strength

Monday Motivation: ఏడ్వడం అనేది ఓ ఎమోషన్.. దాన్ని వీక్​నెస్​గా తీసుకోకండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 14, 2022 06:00 AM IST

Monday Motivation: ఏడుపు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నవ్వు ఎక్కువైనప్పుడు వచ్చేది. మరోటి బాధలో వచ్చేది. నవ్వినప్పుడు వచ్చేది మీకు బెస్ట్ మూమెంట్స్ అని చెప్పుకోవచ్చు. కానీ బాధలో వచ్చేది మీరు మార్చలేనిదో.. మరచిపోలేనిదో అయి ఉంటుంది. మీరు ఏడుస్తున్నారంటే దాని అర్థం మీరు వీక్ అని మాత్రం కాదు.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Monday Motivation : అవును చాలా మంది ఏడుస్తుంటే.. వాళ్లు వీక్ కాబట్టి ఏడుస్తున్నారు అనేస్తారు. కానీ వాళ్ల వరకు ఆ పరిస్థితి వస్తే కానీ మీరు పడే బాధ, వేదన అర్థం కాకపోవచ్చు. కాబట్టి మీరు ఏడుస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా వీక్ అన్నా.. మీకే మీరు వీక్ అనిపించినా అస్సలు నమ్మకండి. ఒప్పుకోకండి. ఏడ్వడం అనేది ఓ ఎమోషన్. అది నవ్వుతో వస్తుంది. బాధతో వస్తుంది. కోపంలో వస్తుంది. ఆఖరుకి ఆవలించినా కూడా కంటి నుంచి నీరు వస్తుంది.

చాలా మంది తమ కోపాన్ని వ్యక్తం చేసే సమయంలో ఏడ్చేస్తారు. అంత మాత్రానా వారు వీక్ అయిపోతారా? కొందరు కళ్ల నుంచి నీరు వచ్చేంతలా నవ్వుతారు. దాని అర్థం వారు వీక్ అనా? కాదు కదా. ఏడ్చేవాళ్లు అంతా వీక్ అంటే.. ఈ ప్రపంచంలో ఉన్నవారంతా బలహీనులే. ఏడుపు అనేది ఎప్పుడు బలహీనత కాదు. అదే మనకు బలం. మీరు బాగా గమనించినట్లైతే.. మీకు కావాల్సిన వ్యక్తిని హత్తుకుని.. మీ బాధని చెప్తూ.. ఏడిస్తే.. ఆ బాధ కాస్తో కూస్తో తగ్గిపోతుంది. దాని అర్థం ఏడిస్తే కష్టం పోతుందని కాదు. బాధలు దూరమైపోతాయని కాదు. మనలోని భారం కాస్త తగ్గుతుంది. తర్వాత మనం ఏమి చేస్తే మంచిగా ఉంటుంది అనే ఆలోచన మనలో మొదలవుతుంది.

లారీ మీద రాస్తారు కదా.. నీ ఏడుపే నా ఎదుగుదల అని. నిజం చెప్పాలంటే.. మన ఏడుపే మన ఎదుగుదల. మనలో భారం ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏమి ఆలోచించలేము. ఏ నిర్ణయాన్ని తీసుకోలేము. చాలా కన్ఫ్యూజ్ స్టేస్​లో ఉంటాము. కానీ బాగా ఏడ్చాకా.. మనలో కొన్ని ఆలోచనలు మొదలవుతాయి. లేదంటే మంచి నిద్ర వస్తాది. ప్రశాంతంగా పడుకున్నప్పుడు మన మైండ్ కూడా చాలా షార్ప్​గా పనిచేస్తుంది. అది మిమ్మల్ని మంచి నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తుంది. కాబట్టి ఏడ్చినప్పుడు మిమ్మల్ని మీరు వీక్ అనుకోకండి. ఏడుపు ఎవరికైనా ఒక్కటే. అమ్మాయిలే ఏడుస్తారు. అబ్బాలు ఏడ్వకూడదనే నిబంధనలు కాల్చి బూడిదలో వేసేయండి. అబ్బాయిలు మీరు కూడా ఏడ్వండి. ఏడిస్తే.. మీలోని భారం కొంచెం తీరుతుంది. ఇలా ఎమోషన్స్​ని లోపల దాచేసుకుంటే.. ఫ్యూచర్​లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

పైగా అమ్మాయిలు మీకో విషయం తెలుసా? ఏడ్చిన తర్వాత మీ ముఖం చాలా మంచిగా ఉంటుంది. ఏదో ఒకసారి బాగుంది కదా అని రోజూ ఏడుస్తూ కూర్చోకండి. మీ ఏడుపునే మీరు ఎదగడానికి వాడుకోండి. పక్కన వాళ్లపై పడి ఏడ్వకుండా.. మన గురించి మనం ఏడ్చుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా మనకి మంచిది. కాబట్టి ఏడ్వడాన్ని నామోషీగా ఎప్పుడూ ఫీల్​ అవ్వకండి. ఫీల్​ ఫ్రీగా ఏడ్వండి. మీ మనసు కాస్త ఫ్రీ చేసి.. మంచి నిర్ణయాలు తీసుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం