Holi Colours Side Effects : హోలీ రంగులతో ఆరోగ్య సమస్యలు.. జాగ్రత్త-holi 2023 beware of these side effects with holi colours ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Holi 2023 Beware Of These Side Effects With Holi Colours

Holi Colours Side Effects : హోలీ రంగులతో ఆరోగ్య సమస్యలు.. జాగ్రత్త

HT Telugu Desk HT Telugu
Mar 06, 2023 10:48 AM IST

Holi Colours Side Effects : రంగులు లేకుండా హోలీ లేదు. అయితే రసాయనాలతో తయారు చేసే రంగులతో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని ఉపయోగించడం కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి.

హోలీ రంగులు
హోలీ రంగులు

మనం హోలీని జరుపుకోవడానికి ఉపయోగించే రంగుల్లో ఆస్బెస్టాస్, సిలికా, మైకా, సీసం వంటి అనేక రకాల విషపూరిత రసాయనాలు ఉన్నాయి. ఇవి చర్మానికి, కళ్లకు హాని కలిగించడమే కాకుండా శ్వాసకోశ సమస్యలను కూడా కలిగిస్తాయని మీకు తెలుసా? రసాయనాలతో(Chemicals) తయారు చేసే హోలీ రంగులతో దుష్ప్రభావాలు వస్తాయి. రసాయనాలు, విషపూరిత లోహ ఆధారిత పిగ్మెంట్లు, మైకా, గాజు కణికలు, ఆస్బెస్టాస్ వంటివి హోలీ రంగులను(Holi Colours) తయారు చేయడానికి ఉపయోగించే కొన్ని పదార్థాలు. ఈ పదార్థాలు మన ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తాయో తెలుసుకోవాలి.

పొడిగా ఉండే రంగులు గాలిలోకి విసిరినప్పుడు చాలా నెమ్మదిగా పడిపోతాయి. ఇది 10 మైక్రాన్ల కంటే తక్కువ కణాల యొక్క అధిక సాంద్రతలలో భారీ లోహాలు, కలుషితాల ఉనికిని సూచిస్తుంది. రంగుల్లోని కలుషితాలు నోటిలోకి, శ్వాసనాళాల్లోకి ప్రవేశించి శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి. ఈ కణాలు ఫిల్టర్(Filter) చేయబడటానికి చాలా చిన్నవి. కాబట్టి అవి ఊపిరితిత్తులలోకి పీల్చేస్తారు. ఒకసారి ఊపిరితిత్తులలోకి చేరితే, అవి అక్కడే ఉండి మంట, ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.

రంగులలో రేణువుల రసాయనాలు ఉన్నందున, రోగనిరోధక శక్తి(Immunity) తక్కువగా ఉండే లేదా ఆస్తమా ఉన్న వ్యక్తులు హోలీ రంగులను ఉపయోగించొద్దు. ఆస్తమా, బ్రోన్కైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) మరియు ఇతర శ్వాసకోశ పరిస్థితులు ఈ రసాయనాల ద్వారా తీవ్రతరం అవుతాయి, ఫలితంగా గురక, దగ్గు, శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది.

సింథటిక్ రంగులు మన నాసికా కుహరాలను కూడా చికాకుపరుస్తాయి. రినిటిస్ లేదా అలెర్జీ జలుబులను ప్రేరేపిస్తాయి. వాయుమార్గాలకు తీవ్రసున్నితత్వాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే సింథటిక్ రంగులు(Colours) పీల్చే చిన్న కణాలను కలిగి ఉంటాయి. ఇది ముక్కు, వాయుమార్గాల యొక్క శ్లేష్మ పొర చికాకు మరియు వాపుకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ కణాలు శరీరం నుండి రోగనిరోధక ప్రతిస్పందనను కూడా ప్రేరేపిస్తాయి. ఇది అలెర్జీ ప్రతిచర్యకు దారితీస్తుంది.

వాటర్-గన్‌లు లేదా వాటర్ బెలూన్‌లతో(Water balloon) హోలీ ఆడటం మంచిది కాదు. ఎందుకంటే చెవిలో నీరు ప్రవేశించి దురద, చెవినొప్పి, అడ్డంకులు ఏర్పడవచ్చు. చెవిపోటుకు కారణమవుతుంది. తీవ్రమైన సందర్భాల్లో చెవిపోటుతో వినికిడి లోపం ఏర్పడవచ్చు. శస్త్రచికిత్స అవసరం కావచ్చు.

ఒక అధ్యయనంలో, హోలీ రంగులు తీవ్రమైన చర్మ అలెర్జీలకు కారణమవుతాయని కనుగొనబడింది. దురద అత్యంత సాధారణ లక్షణం, ఆ తర్వాత చర్మం మంట, నొప్పిలాంటివి ఉంటాయి.

WhatsApp channel

టాపిక్