Friday Motivation : అలాంటివారికి అంత సీన్ ఇవ్వకండి.. వీలైనంత త్వరగా బాయ్ చెప్పేయండి..-friday motivation on don t let negative and toxic people rent space in your head ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Friday Motivation On Don't Let Negative And Toxic People Rent Space In Your Head

Friday Motivation : అలాంటివారికి అంత సీన్ ఇవ్వకండి.. వీలైనంత త్వరగా బాయ్ చెప్పేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 13, 2023 04:00 AM IST

Friday Motivation : జీవితంలో రకరకాల వ్యక్తులను కలుస్తాము. అలా కలిసిన వారిలో మంచి వారు ఉండొచ్చు. చెడ్డవారు ఉండొచ్చు. మంచితో పెద్ద బాధేమి లేదు కానీ. చెడ్డవారితో అసలు సమస్య వస్తుంది. వారివల్ల మీ బుర్ర కరాబ్ అవుతుంది అనుకుంటున్నప్పుడు వారి గురించి ఎందుకు ఆలోచించడం. ఏదొక రీజన్ వెతుక్కుని వారిని మీ ఆలోచనల నుంచి శాశ్వతంగా దూరం చేసేయండి.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Friday Motivation : పొద్దున్న లేచినప్పటి నుంచి.. రాత్రి పడుకునేవరకు మనం రకరకాల వ్యక్తిత్వాలు ఉన్నవారితో ఇంటరాక్ట్ అవుతాము. ప్రతిచోటా కొత్త వ్యక్తులను కలుస్తాము. మంచిగా ఉండి.. అందరికీ మంచి జరగాలని కోరుకునే వ్యక్తులను కలుస్తాము. అలాగే తమ పని తాము చేసుకుంటూ.. ఎవరిని ఇబ్బంది పెట్టనివారిని కలుస్తాము. అలాగే.. ప్రతికూల వ్యక్తిత్వం ఉన్నవారిని.. విషపూరితమైన భావాలతో నిండిన వారిని కూడా మనం కలవాల్సి వస్తాది. ఇలాంటి వారు ఎప్పుడూ మనతో పాటు మన చుట్టూ ఉన్నవారికి కూడా ప్రతికూలంగా ఉంటారు. సెల్ఫిష్​గా ఉండడం తప్పు కాదు. కానీ.. ఇతరులు బాగుపడకూడదనుకునేవారు.. ఇతరులకు వచ్చే అవకాశాలను దూరం చేసే వారు సమాజానికి అస్సలు కరెక్ట్ కాదు.

అలాంటివారు మిమ్మల్ని ముందుకు వెళ్లనీయకుండా.. మిమ్మల్ని వెనక్కి లాగుతూనే ఉంటారు. మనతో ఉంటూ.. ఏదొక రోజు మనకు వచ్చే అవకాశాలను వాళ్లు దోచేసుకుంటారు. అంతేకాకుండా మీరు ఎంత పాజిటివ్​గా ముందుకు వెళ్లాలి అనుకున్నా.. మీ మనస్సును ద్వేషంతో, సందేహాలతో నింపేస్తారు. దీనివల్ల మీరు దేనిపై సరిగ్గా ఫోకస్ చేయలేరు. అంతేకాకుండా ఇలాంటి మైండ్​సెట్​తో మీరు ముందుకు వెళ్లడం చాలా కష్టమవుతుంది. నెగిటివ్ మైండ్​ అనేది తెలియకుండా వ్యక్తిని ఓటమి వైపు నడిపిస్తుంది.

ఒకవేళ అలాంటివారు మీతో ఉన్నా.. లేదా మీకు దూరంగా ఉంటూ మీ ఆలోచనల్లో.. మీ జీవితాల్లో ఉన్నా.. వారిని వీలైనంత త్వరగా వదిలించుకోండి. వారు మిమ్మల్ని నిరాశ, నిస్పృహలకు మాత్రమే గురిచేస్తారు. వారి వల్ల మీకు రూపాయి ఉపయోగం కూడా ఉండదు. పైగా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారిని మీ ఆలోచనల నుంచి.. జీవితాలనుంచి ఎంత త్వరగా వీలైతే.. అంత త్వరగా పంపించేయండి.

మీ మంచిని కోరుకునేవారు కచ్చితంగా మీ జీవితాన్ని మెరుగుపరుస్తారు. అలాంటివారితో ఎక్కువ సమయం గడపండి. అది మీకు, మీ భవిష్యత్తుకు చాలా మంచిది. కానీ.. వారిలో ఎవరైనా టాక్సిక్ వ్యక్తులు ఉంటేమాత్రం వారికి దూరంగా ఉండండి. ఎందుకంటే చెడు ఎప్పుడూ మంచి ముఖంతోనే వస్తుంది. మనల్ని గుడ్డిగా నమ్మేలా చేస్తుంది. అంతేకానీ మీ ఆలోచనల్లో విషం నింపి.. నెగిటివ్ థాట్స్ ఇచ్చేవారికి వీలైనంత దూరంగా ఉండండి. అలాంటివారిని దూరంగా పంపించడానికి ఏదొక ఎత్తుగడ అయితే మీరు కచ్చితంగా వేయండి. వారు మీతో ఉన్నంత కాలం మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఒకవేళ వేసినా.. మరో పది అడుగులు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. మీ సర్కిల్ చిన్నగా ఉన్నా పర్లేదు. అంతేకానీ ఎవరు పడితే వాళ్లను మాత్రం దగ్గరకు రానివ్వకండి. బెస్ట్ పీపుల్ మీతో ఉంటే చాలు.. వరస్ట్ పీపుల్ ఎక్కుడున్నా అది మనకి అనవసరం అనుకోండి. సింపుల్.

WhatsApp channel

సంబంధిత కథనం