Yoga Asanas to Boost Your Immunity : కొవిడ్ విజృంభిస్తున్న వేళ ఇమ్యూనిటీ కోసం ఈ నాలుగు ఆసనాలు వేయండి..-covid 19 4th wave precautions try these yoga asanas to boost your immunity ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Covid 19 4th Wave Precautions Try These Yoga Asanas To Boost Your Immunity

Yoga Asanas to Boost Your Immunity : కొవిడ్ విజృంభిస్తున్న వేళ ఇమ్యూనిటీ కోసం ఈ నాలుగు ఆసనాలు వేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 23, 2022 09:00 AM IST

Yoga Asanas to Boost Your Immunity : కరోనాను మరిచిపోతున్నామురా బాబు అనుకునేసరికి.. నేనెక్కడికి వెళ్లాను అంటూ మరోసారి విజృంభిస్తుంది కరోనా. ప్రభుత్వాలు ఇప్పుడే ఆంక్షలు విధించడం ప్రారంభించాయి. అయితే ఈ సమయంలో రోగ నిరోధశక్తి పెంచుకోవడం చాలా ముఖ్యం. యోగాతో ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

యోగా ఆసనాలతో ఇమ్యూనిటీ పెంచుకోండి
యోగా ఆసనాలతో ఇమ్యూనిటీ పెంచుకోండి

Yoga Asanas to Boost Your Immunity : కోవిడ్ కేసులో మరోసారి పెరుగుతున్నాయి. సెకండే వేవ్​లో జరిగే పరిణామాలే మళ్లీ ఎదురుకావొచ్చు అంటున్నారు అధికారులు. అయితే ఈ సమయంలో రోగనిరోధక శక్తిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తినే ఆహారం, జీవన శైలిలో పలు మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి యోగా చాలా సహాయం చేస్తుంది అంటున్నారు యోగా నిపుణులు. కొన్ని ఆసనాలు వేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెప్తున్నారు. ప్రతిరోజూ వీటిని సాధన చేయడం ద్వారా మీరు మంచి ఇమ్యూనిటీ పొందవచ్చు అంటున్నారు.

గత ఆరు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రోజువారీ సగటు కేసులు 5 లక్షలకు పైగా నమోదయ్యాయి. చైనాలో అయితే కరోనా బాధితుల సంఖ్య వేగంగా మరింత పెరుగుతోంది. కోవిడ్-19 ఉప్పెన తిరిగి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం చాలా అవసరం. అన్నింటికంటే ముఖ్యంగా సామాజిక దూరాన్ని పాటించాలి. బయటకు వెళ్లేప్పుడు మాస్క్, చేతులను శానిటైజేషన్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాగే ఈ యోగా ఆసనాలతో ఇమ్యూనిటీ పెంచుకోండి. ఇంతకీ ఏ ఆసనాలతో మీరు రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

అధోముఖ స్వనాసనం

ఈ ఆసనం వేయడం కోసం.. ముందుగా నేలపై బోర్లా పడుకోండి. నెమ్మదిగా మీ మొండెం పైకి ఎత్తండి. మీ శరీరంతో పర్వతం లాంటి నిర్మాణాన్ని ఏర్పరుచుకోండి. మీ అరచేతులు, పాదాలపై బరువు ఆన్చూతూ.. ఈ ఆసనంలో కొంత సేపు ఉండాలి. మీ శరీరం తప్పనిసరిగా ఒక త్రిభుజాన్ని ఏర్పరచాలి. కొన్ని సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండండి. కనీసం 10 సార్లు ఈ ఆసనం పునరావృతం చేయండి.

భుజంగాసనం

నేలపై బోర్లా పడుకుని.. మీ అరచేతుల సపోర్ట్ తీసుకుంటూ.. నెమ్మదిగా మీ మొండెం పైకి ఎత్తండి. అరచేతులు, దిగువ శరీరం మాత్రమే నేలను తాకాలి. ఈ స్థానంలో 30 సెకన్లు ఉండండి. ప్రతిరోజూ 3-4 సార్లు ఈ ఆసనం వేయండి.

సేతు బంధాసనం

నేలపై పడుకోండి. మీ చేతులను మీకు ఇరువైపులా ఉంచండి. మీ తుంటిని నేల నుంచి పైకి నెమ్మదిగా ఎత్తండి. మీ పైభాగం, తల, చేతులు, పాదాలు మాత్రమే నేలను తాకాలి. ఈ భంగిమలో 10 సెకన్ల పాటు ఉండండి. 4 నుంచి 5 సార్లు ఈ ఆసనం వేయండి.

బాలసానాం

మోకాళ్లపై కూర్చోండి. మీ పాదాలు పైకప్పును చూడాలి. ఇప్పుడు నేలపైకి నెమ్మదిగా మీ మొండెం ముందుకు వంచి.. మీ చేతులను వీలైనంత వరకు విస్తరించండి. మీ ముఖం నేలకి తాకుతూ.. మీ చేతులను చాచండి. ఈ ఆసనంలో 10 నుంచి 15 సెకన్లు ఉండాలి. దీన్ని ప్రతిరోజూ 4 నుంచి 5 సార్లు ప్రాక్టీస్ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం