Rahul's swipe at BJP: ‘యాత్రను చూసి భయపడ్డారు.. అందుకే ఈ కోవిడ్ వంకలు’-excuses scared of india s truth rahul s swipe at bjp over mandaviya s letter ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul's Swipe At Bjp: ‘యాత్రను చూసి భయపడ్డారు.. అందుకే ఈ కోవిడ్ వంకలు’

Rahul's swipe at BJP: ‘యాత్రను చూసి భయపడ్డారు.. అందుకే ఈ కోవిడ్ వంకలు’

HT Telugu Desk HT Telugu
Dec 22, 2022 06:50 PM IST

Rahul's swipe at BJP over Covid threat: కరోనాపై రాజకీయం ప్రారంభమైంది. కోవిడ్ కేసులు పెరిగే ప్రమాదమందన్న కారణం చూపుతూ రాహుల్ గాంధీని భారత్ జోడో యాత్రను నిలిపి వేయాల్సిందిగా కేంద్రం లేఖ రాసింది. భారత్ జోడో యాత్రను చూసి కేంద్రం భయపడ్తోందని రాహుల్ వ్యాఖ్యానించారు.

Congress leader Rahul Gandhi. (File image)
Congress leader Rahul Gandhi. (File image) (PTI)

కరోనా పై రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ప్రారంభమయ్యాయి. చైనా సహా వివిధ దేశాల్లో కరోనా(corona) కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని సూచనలను కేంద్రం రాష్ట్రాలకు చేసింది.

Politics over covid resrictions on Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వల్ల కోవిడ్ (Covid) వ్యాప్తి చెందే అవకాశముందని, అందువల్ల యాత్రలో పూర్తిస్థాయిలో కొవిడ్ (Covid) ప్రొటోకాల్ ను పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ రాహుల్ కు లేఖ రాశారు. యాత్రలో పాల్గొనే అందరూ corona వాక్సిన్ వేసుకుని ఉండాలని, కచ్చితంగా అంతా కోవిడ్ ప్రొటొకాల్ ను పాటించాలని స్పష్టం చేశారు. ఒకవేళ కొవిడ్(Covid) ప్రొటోకాల్ ను పాటించలేని పక్షంలో భారత్ జోడో యాత్రను నిలిపివేయాలని సూచించారు.

Politics over covid resrictions on Bharat Jodo Yatra: కేంద్ర మంత్రిపై రాహుల్ గాంధీ విమర్శలు

భారత్ జోడో యాత్ర గురువారం హరియాణాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి రాసిన లేఖ విషయాన్ని ప్రస్తావించారు. కోవిడ్(Covid) కేసుల పెరుగుదల అనేది కేవలం ఒక వంక అని, తన భారత్ జోడోయాత్ర సాధిస్తున్న విజయాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ భయపడ్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా(corona) వంకతో యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ గుజరాత్ ఎన్నికల ప్రచారం సమయంలో కోవిడ్(Covid) ప్రొటోకాల్ పాటించారా? అని మరో కాంగ్రెస్ నేత ప్రశ్నించారు.

IPL_Entry_Point