Unstoppable Anthem Released: అన్‌స్టాపబుల్ 2 స్పెషల్ సాంగ్ రిలీజ్.. ఓ లుక్కేయండి
Unstoppable With NBK2: బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాపబుల్ సీజన్ 2 యాంథెమ్ సాంగ్ విడుదల చేశారు. ఈ సీజన్ 2 త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇందులో భాగంగా ఈ స్పెషల్ యాంథెమ్‌ను విడుదల చేశారు.
Unstoppable Season 2 Song Release: నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారతీయ సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్న ప్రజల కథానాయకుడు బాలకృష్ణ, ఆయన అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు బాలయ్య. ఒక నటుడిగా, ప్రొడ్యూసర్ గా, దర్శకుడిగా ఎంతో మందిని అలరించిన బాలయ్య బాబు, ఆహ వారి అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షో ద్వారా హోస్ట్‌గా ప్రేక్షకులమదిని కొల్లగొట్టారు. ఇప్పుడు మరోసారి "అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే" సీజన్ 2ద్వారా మరోసారి అభిమానులను ఊర్రూతలూగించనున్నారు. అక్టోబరులోనే ఈ సీజన్ 2కు ముహూర్తం ఫిక్స్ చేశారు. తాజాగా ఈ షో కోసం టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు.
ఈ పాట గురించినందమూరి బాలకృష్ణమాట్లాడుతూ,"రోల్ రైడ, మహతి స్వర సాగర్ సమకూర్చిన ఈ పాట నాకు ఎంతో బాగా నచ్చింది. ఆహ అభిమానుల అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను." అని అన్నారు.
గత సీజన్‌లో మోహన్ బాబు, నాని, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, రవితేజ, గోపిచంద్ మలినేని, మహేశ్ బాబు తదితరులు ఈ షోకు హాజరయ్యారు. ఈ సీజన్‌కు టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలా మంది రాబోతున్నట్లు సమాచారం. పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్, అనుష్క శెట్టి లాంటి వాళ్లు ఇందులో భాగం కాబోతున్నారని తెలుస్తోంది. అన్‌స్టాపబుల్ షోకు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాది దీపావళి సందర్భంగా లాంచ్ అయిన ఈ షో.. 2022 ఫిబ్రవరి 2 వరకు నడిచింది
మరోపక్క బాలకృష్ణ.. గోపిచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. NBK 107 వర్కింగ్ టైటిల్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశముంది. ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సాయి మాధవన్ బుర్రా సంభాషణలు రాశారు.
సంబంధిత కథనం