Adah Sharma Horror Movie: హారర్ మూవీతో భయపెట్టబోతున్న అదాశర్మ - సీడీ ట్రైలర్ రిలీజ్
Adah Sharma Horror Movie: హారర్ మూవీతో అదాశర్మ తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది. సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్) అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ మే 10న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ హారర్ మూవీ ట్రైలర్‌ను శనివారం రిలీజ్ చేశారు.
Adah Sharma Horror Movie: లాంగ్ గ్యాప్ తర్వాత హారర్ మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది అదాశర్మ. సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్) పేరుతో ఓ హారర్ మూవీ చేస్తోంది. సీడీ ట్రైలర్‌ను శనివారం రిలీజ్ చేశారు. చీకటి వెలుతురు మధ్య కనిపించని శత్రువు ఎవరో ఉన్నారు అంటూ విశ్వాంత్ దుద్దుంపూడి చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత రెడ్ డ్రెస్‌లో ఓ అమ్మాయి కనిపించింది. ఆమె ముఖం మాత్రం చూపించలేదు. వరుస మిస్సింగ్ కేసులతో సిటీ మొత్తం రెడ్ అలర్ట్ అనగానే ట్రైలర్‌లో అదాశర్మ యాక్షన్ ఎపిసోడ్‌తో ఎంట్రీ ఇచ్చింది.
దయ్యం మిస్టరీ...
తనను చుట్టూ ముట్టిన రౌడీల దుమ్ము రేగ్గొడుతూ అదాశర్మ కనిపించింది. తనతో పాటు ఇంట్లో ఉంటున్నది దయ్యమని విశ్వాంత్ తెలుసుకోవడం, తనను చంపడానికి ఆ దయ్యం ముసుగులో ఉన్న అదాశర్మ చేసే ప్రయత్నాల చుట్టూ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ట్రైలర్ చివరలో నన్ను చంపడానికి వచ్చింది ఎవరు క్రిమినల్ ఆర్ డెవిల్ అంటూ విశ్వాంత్ చెప్పే డైలాగ్ ఉత్కంఠను పంచుతోంది. ట్రైలర్ అదా శర్మ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రోహిణి, మహేష్ విట్టా కీలక పాత్రలను పోషిస్తోన్నారు.
మే 10న రిలీజ్...
సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్) మూవీకి కృష్ణ అన్నం దర్శకత్వం వహిస్తున్నాడు. మే 10న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఎస్‌సీఎమ్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ మూవీకి ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందిస్తున్నారు.
రాజశేఖర్ కల్కి తర్వాత...
2019లో రిలీజైన రాజశేఖర్ కల్కి తర్వాత తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది అదాశర్మ. సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్) మూవీతో దాదాపు ఐదేళ్ల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది.
గత ఏడాది ది కేరళ స్టోరీ మూవీతో కెరీర్‌లోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్నది అదాశర్మ. కేరళలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు సుదీప్తో సేన్ ది కేరళ స్టోరీని తెరకెక్కించారు. చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ 300 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. గత ఏడాది బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తొమ్మిదో మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.
ప్రశంసలతో పాటు విమర్శలు...
కేరళలో కనిపించకుండా పోతున్న అమ్మాయిలు ఎలా ఐసిస్‌లో చేరుతోన్నారు? ఆ అమాయకులను మతమార్పిలకు పోత్సహిస్తూ ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలకు ఎలా వాడుకుంటున్నాయన్నది దర్శకుడు ఈ సినిమాలో చూపించిన తీరుపై ప్రశంసలతో పాటు విమర్శలొచ్చాయి.
ఓ వర్గం కోణం నుంచే ఈ మూవీ సాగిందని, ఇందులో చూపించినవన్నీ నిజం కాదంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ది కేరళ స్టోరీ తర్వాత దర్శకుడు సుదీప్తో సేన్‌తో బస్తర్ అనే మూవీ చేసింది అదాశర్మ. ఇటీవలే ఈ మూవీ రిలీజైంది.