Lavanya Tripathi Upcoming Movies: స్పీడ్ పెంచిన లావణ్య త్రిపాఠి.. వరుస చిత్రాలతో ఫుల్ బిజీ
Lavanya Tripathi Upcoming Movies: టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో ఓ సినిమా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. మరో రెండు చిత్రాలకు పచ్చ జెండా ఊపింది.
అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన లావణ్య త్రిపాఠి.. దశాబ్ద కాలంలో ఎన్నో సినిమాల్లో నటించారు. అంతేకాకుండా తన ఖాతాలో అద్భుత విజయాన్ని అందుకున్న చిత్రాలను వేసుకున్నారు. ఈ ఏడాది హ్యాపీ బర్త్ డే చిత్రంతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం గేరు మార్చి వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ఇప్పటి వరకు తెలుగులో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది.
ప్రస్తుతం తమిళంలో హీరో అధర్వాతో ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా రెండు పాటలు మినహా పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది చిత్రబృంం. ఇది కాకుండా జీ 5 పులి మేక అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేస్తోంది. దీనికి కొనా వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఇవి కాకుండా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థలో లావణ్య ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. దీనికి మంజునాథ దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తంగా ఓ తమిళ సినిమా, ఓ తెలుగు సినిమా సహా ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇలా వైవిధ్యంగా ముందుకెళ్తున్న లావణ్య త్రిపాఠి త్వరలోనే మరో రెండు ప్రాజెక్టులు అనౌన్స్ చేయనున్నారు.
అందాల రాక్షిసితో అరంగేట్రం చేసిన లావణ్య.. తన యాక్టింగ్‌తో తొలి చిత్రంతో యువత మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. దీని తర్వాత దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు, ఉన్నది ఒక్కటే జిందగీ, అర్జున్ సురవరం, ఏ1 ఎక్స్‌ప్రెస్ లాంటి హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు.
సంబంధిత కథనం