Sonam Kapoor: సోనమ్ కపూర్ బ్రదర్స్ ఆమె ఫ్రెండ్స్ ఎవరినీ వదల్లేదట.. అందరితోనూ..
Sonam Kapoor: కాఫీ విత్ కరణ్ షోలో హోస్ట్ కరణ్ జోహార్ అడిగే ప్రశ్నల్లో ఎంత బూతు ఉంటుందో తెలుసు కదా. తాజాగా బాలీవుడ్ నటి, ప్రెగ్నెంట్ అయిన సోనమ్ కపూర్ ఈ షోకు రాగా.. అతడు అడిగిన ఓ ప్రశ్నకు చాలా బోల్డ్‌గా సమాధానమిచ్చింది.
నీ ఫ్రెండ్స్‌లో ఎంతమంది మీ బ్రదర్స్‌తో పడుకున్నారని అనుకుంటున్నావ్.. ఇదీ కాఫీ విత్ కరణ్ షోలో హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ఓ ప్రశ్న. దీనికి సోనమ్ కపూర్ ఇచ్చిన సమాధానమేంటో తెలుసా? నా బ్రదర్స్ అందరూ కలిసి ఎవరినీ వదల్లేదు అని. తాజా కాఫీ విత్ కరణ్ షో ప్రోమో రిలీజ్ కాగా.. అందులో కరణ్ ఈ ప్రశ్న అడగడం, దానికి సోనమ్ ఇలా సమాధానమివ్వడంతో పక్కనే ఉన్న ఆమె సోదరుడు అర్జున్ కపూర్ షాక్ తిన్నాడు.
నీ బ్రదర్స్ మరీ ఇలాంటి వాళ్లా అంటూ కరణ్ మరోసారి పెద్దగా నవ్వుతూ ప్రశ్నిస్తాడు. సీజన్ 7లో లేటెస్ట్‌లో రిలీజైన ఈ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ముఖ్యంగా కరణ్ అడిగిన ప్రశ్నకు సోనమ్ రియాక్టయిన తీరు నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. అయితే ఆమె జోక్ చేసిందా లేక ఆ తర్వాత ఏం చెప్పింది అన్నది మాత్రం ఆ షో పూర్తిగా చూసిన తర్వాతే తేలనుంది.
కానీ కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ జోహార్ గెస్ట్‌లను తరచూ ఇలా సెక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతుండటంపై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యే టాలీవుడ్, బాలీవుడ్ నటి తాప్సీ కూడా చాలా ఘాటుగా స్పందించింది. ఈ షోకు ఎందుకు వెళ్లడం లేదు అని అడిగితే.. తన సెక్స్ జీవితం అంత ఆసక్తికరంగా లేదు అంటూ ఆమె పరోక్షంగా కరణ్ జోహార్‌కు పంచ్ వేసింది.
ఇక తాజా ఎపిసోడ్‌లో ప్రెగ్నెంట్‌గా ఉన్న సోనమ్ కపూర్ తన సోదరుడు అర్జున్ కపూర్‌తో కలిసి వచ్చింది. అది కూడా రక్షా బంధన్ స్పెషల్ ఎపిసోడ్ కావడం గమనార్హం. ఇలాంటి షోలోనూ కరణ్ తన బూతు ప్రశ్నలను మానలేదు. దానికి వచ్చిన గెస్ట్‌లు కూడా అలాగే సమాధానాలివ్వడంతో ఈ షోపై సాధారణ అభిమానుల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ మధ్యే లైగర్ ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ, అనన్యా పాండే కూడా ఈ షోకు వచ్చిన విషయం తెలిసిందే.