‘liger' in economy class: ఎకానమీ క్లాస్‌లో విజయ్ దేవరకొండ అనన్య పాండే.. ఎందుకంటే
Vijay Devarakonda travels in economy class: విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఇటీవల ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించారు. లైగర్ ప్రమోషన్ల కోసం వారు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఇటీవల విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించారు. నిర్మాత ఛార్మీ కౌర్ విజయ్ దేవరకొండ, అనన్య పాండే విమానంలో ఒకరి పక్కన మరొకరు కూర్చున్న క్లిప్‌ను పోస్ట్ చేశారు. అనన్య కిటికీ సీట్లో కూర్చోగా, విజయ్ మధ్య సీటులో కూర్చుని కనిపించారు.
ట్రెండింగ్ వార్తలు
అనన్య తన టీమ్‌తో మాట్లాడుతుండగా ప్రయాణికులు ఫ్లైట్ ఎక్కుతున్న దృశ్యంతో ఆ వీడియో క్లిప్ మొదలవుతుంది. అనన్య బ్లూ టాప్, తెలుపు ప్యాంటు ధరించింది. విజయ్ దేవరకొండ తెల్లటి షర్ట్, నలుపు ప్యాంటు ధరించాడు. ఇద్దరి ముఖాలకు మాస్క్‌లు ఉన్నాయి. ఈ నటీనటులు తమ రాబోయే చిత్రం లైగర్ ప్రమోషన్ల కోసం ప్రయాణిస్తున్నారు.
క్లిప్‌ను షేర్ చేస్తూ ‘నిర్మాతల నటుడు, పీపుల్స్ హీరో మా లైగర్ విజయ్ దేవరకొండ. మా రాకింగ్ బ్యూటీ అనన్యా పాండే..’ అని పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది ఛార్మి.
తన ఇన్‌స్టాగ్రామ్‌లో అనన్య విభిన్న పోజులు ఇచ్చిన తన చిత్రాలను షేర్ చేసింది. లైగర్ ప్రమోషన్ కోసం ఈ నటీనటులు గుజరాత్ వెళ్లారు.
ధర్మ ప్రొడక్షన్స్ ఒక వీడియోను పోస్ట్ చేసింది. దీనిలో విజయ్ దేవరకొండ, అనన్య ఒక వేదికపై నిలబడి ప్రేక్షకులతో మాట్లాడుతున్నారు. ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య వారు పసుపు రంగు బెలూన్లను గాలిలోకి వదిలేశారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న లైగర్ స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం. ఈ ఏడాది ఆగస్ట్ 25న థియేటర్లలో విడుదల కానుంది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న లైగర్ సినిమా హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఈ చిత్రం విజయ్ దేవరకొండ మొదటి బాలీవుడ్ ఎంట్రీ. అనన్య పాండేకు మొదటి బహుభాషా చిత్రం. వీరితో పాటు రామీ కృష్ణన్, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశపాండే, గెటప్ శ్రీను కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రంలో ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించనున్నారు.