వారితో సెక్స్‌ చేసిన వారిలోనే మంకీపాక్స్ ఎక్కువ: ఈసీడీసీ-more than 200 cases of monkeypox worldwide eu disease agency ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  వారితో సెక్స్‌ చేసిన వారిలోనే మంకీపాక్స్ ఎక్కువ: ఈసీడీసీ

వారితో సెక్స్‌ చేసిన వారిలోనే మంకీపాక్స్ ఎక్కువ: ఈసీడీసీ

HT Telugu Desk HT Telugu
May 26, 2022 10:26 AM IST

మంకీపాక్స్ నిర్ధారిత కేసులు ప్రపంచవ్యాప్తంగా 219 దాటేశాయని యురోపియన్ యూనియన్ డిసీజ్ ఏజెన్సీ వెల్లడించింది.

ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ చిత్రంలో పరిపక్వమైన, ఓవల్-ఆకారంలో ఉన్న మంకీపాక్స్ వైరస్ కణాలు (ఫైల్ ఫోటో)
ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ చిత్రంలో పరిపక్వమైన, ఓవల్-ఆకారంలో ఉన్న మంకీపాక్స్ వైరస్ కణాలు (ఫైల్ ఫోటో) (VIA REUTERS)

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కలిపి మొత్తంగా 219 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని యురోపియన్ యూనియన్‌కు చెందిన డిసీజ్ ఏజెన్సీ తెలిసింది.

12 దేశాలు, ముఖ్యంగా యూరప్ దేశాలు కనీసం ఒక్కో నిర్ధారిత కేసులను నివేదించాయని యురోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ఈసీడీసీ) బుధవారం రాత్రి వెల్లడించింది.

‘పశ్చిమ, మధ్య ఆఫ్రికాలతో సంబంధం లేకుండా ఈ వ్యాధి యూరప్‌లో స్థానికంగా విస్తరిస్తుండడం ఇదే తొలిసారి..’ అని ఆ ఈసీడీసీ విడుదల చేసిన నోట్ తెలిపింది. 

ఎక్కువ మేరకు కేసులు యువకులలో కనుగొన్నట్టు తేలింది. వీరంతా స్వలింగ సంపర్కంలో పాల్గొన్నట్టు స్వయంగా వెల్లడించారని నోట్ తెలిపింది.

మే ప్రారంభంలో అసాధారణ రీతిలో యూకేలో మంకీపాక్స్ కేసు వెలుగు చూసింది. ఇక్కడ ప్రస్తుతం 71 కేసులు నమోదయ్యాయి. తదుపరి స్పెయిన్‌లో 51 కేసులు, పోర్చుగల్‌లో 37 కేసులు నమోదయ్యాయి.

ఇక యూరప్ వెలుపల కెనడాలో 15, అమెరికాలో 9 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. మే 20న తొలిసారి కేసు వెలుగు చూసిన తరువాత ఇప్పటివరకు యూరప్‌లో 38 కేసులు నమోదయ్యాయి. అంటే ఇప్పటికే 5 రెట్లు పెరిగాయి.

అయితే అంటువ్యాధి ప్రమాదం చాలా తక్కువ అని ఈసీడీసీ ఈ వారం ఆరంభంలో తెలిపింది. కానీ ఒకరి కంటే ఎక్కువ సెక్స్ పార్ట్‌నర్స్ ఉన్నవారిలో ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు హెచ్చరించింది. లైంగిక సంబంధం ఎలాంటిదన్న అంశంతో సంబంధం లేకుండా, మల్టిపుల్ సెక్సువల్ పార్ట్‌నర్స్ ఉంటే మాత్రం ప్రమాదం తప్పదని హెచ్చరించింది.

‘ఈ వ్యాధి తీవ్రత అంత ప్రమాదకరం ఏమీ కాదు..’ అని చెబుతూ ఇప్పటివరకు ఈ వ్యాధుల వల్ల మరణాలు నమోదు కాలేదని తెలిపింది.

స్మాల్ పాక్స్‌‌లాగే ఉండే ఈ డిసీజ్ దానితో పోలిస్తే అంత తీవ్రమైనది కాదని, పశ్చిమ, దక్షిణ ఆఫ్రికాలోని 11 దేశాల్లో స్థానికంగా సోకే వ్యాధి అని తెలిపింది.

మంకీపాక్స్ సోకిన జంతువు రక్తంతో నేరుగా గానీ, కొరకడం ద్వారా గానీ ఇది సోకుతుంది. ఆ జంతువు మాంసం, రక్తం, శరీర ద్రవాలతో కూడా సోకుతుంది. హై ఫీవర్‌ వస్తుంది. అలాగే శరీరంపై దద్దుర్లు వస్తాయి.

ఇది సోకిన వారిలో చికెన్‌పాక్స్ తరహా రాషెష్ చేతులపై, ముఖంపై వస్తాయి.

మంకీపాక్స్‌కు ఇప్పటివరకైతే చికిత్స లేదు. కానీ సింప్టమ్స్ సాధారణంగా రెండు వారాల నుంచి నాలుగు వారాల్లో తగ్గిపోతాయి. ఇది ప్రాణాంతకమేమీ కాదు.

మంకీపాక్స్ నియంత్రిత పరిస్థితుల్లో ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమర్జింగ్ డిసీజ్ లీడ్ మేరియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్