Sharmila Tagore on Bikini Scene: అప్పట్లో సంచలనం రేపిన షర్మిల బికినీ సీన్.. పార్లమెంటులో చర్చ-sharmila tagore recalls her bikini scene in an evening in paris ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sharmila Tagore On Bikini Scene: అప్పట్లో సంచలనం రేపిన షర్మిల బికినీ సీన్.. పార్లమెంటులో చర్చ

Sharmila Tagore on Bikini Scene: అప్పట్లో సంచలనం రేపిన షర్మిల బికినీ సీన్.. పార్లమెంటులో చర్చ

Maragani Govardhan HT Telugu
Jan 08, 2024 06:58 PM IST

Sharmila Tagore on Bikini Scene: బాలీవుడ్ అలనాటి తార షర్మిలా ఠాగుర్ తను నటించిన యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్ చిత్రంలోని బికినీ సన్నివేశం గురించి స్పందించారు. అప్పట్లో ఈ సీన్ అందరినీ షాక్‌కు గురిచేసిందని తెలిపారు.

తన బికినీ సీన్‌పై షర్మిల ఠాగుర్ రియాక్షన్
తన బికినీ సీన్‌పై షర్మిల ఠాగుర్ రియాక్షన్

Sharmila Tagore on Bikini Scene: బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిలా ఠాగుర్ ఒకప్పుడు పాపులర్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. 1960, 70వ దశకాల్లో తన అందం, అభినయంతో యావత్ దేశాన్ని ఓ ఊపు ఊపేశారు. ఆమె పర్పార్మెన్స్‌కు రెండు జాతీయ పురస్కారాలు సహా పలు ఇతర అవార్డులు వరించాయి. అప్పట్లో గ్లామర్ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న షర్మిలా ఠాగుర్.. ఓ సినిమాలో ఏకంగా బికినీ ధరించి సంచలనం రేపింది. యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్(1967) అనే చిత్రంలో బికినీలో దర్శనమిచ్చిన షర్మిల ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.

ఇప్పుడంటే బికినీలు, స్విమ్‌సూట్‌లు సర్వ సాధారణమైపోయాయి.. కానీ అప్పట్లో ఈ విషయం పెద్ద దుమారాన్నే రేపింది. తాజాగా ఈ అంశంపై మాట్లాడిన షర్మిలా ఠాగుర్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన బికినీ సీన్ గురించి పార్లమెంటులో సైతం ప్రశ్నలు వర్షం గుప్పించారని స్పష్టం చేశారు.

"నేను యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్ చిత్రం చేసినప్పుడు అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా అందులోని బికినీ సన్నివేశం పెద్ద సంచలనమే రేపింది. పబ్లిక్ నుంచి ప్రముఖల వరకు అంతా షాకయ్యారు. అప్పట్లో ఈ విషయంపై పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తారని అనుకుంటా. ప్రస్తుతం మనం చూస్తున్న సినిమాలతో పోలిస్తే అప్పుడు చాలా అమయాకంగా కనిపించా." అని షర్మిలా అన్నారు.

ఆ సమయంలో జరిగిన ఓ ఫన్నీ సంఘటన గురించి కూడా గుర్తు చేసుకున్నారు షర్మిల. "ఆ సినిమా విడుదలైన సమయంలో మా ఇంటికి దగ్గరలో బికినీ పోస్టర్‌ ఉండేది. మా అత్తగారు టౌన్‌కు వస్తున్నారని తెలిసింది. నేను వెంటనే రాత్రికి రాత్రే ఆ పోస్టర్‌ను తొలగించాలని నా డ్రైవర్‌కు చెప్పాను. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఆమె ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి వచ్చే వరకు చాలా పోస్టర్లను చూశారట." అని నాటి జ్ఞాపకాలను షర్మిల నెమరువేసుకున్నారు.

షర్మిలా ఠాగుర్.. అమర్ ప్రేమ(1972), ఆవిష్కార్(1974), మౌసమ్(1975), నామ్‌కీన్(1975) లాంటి తదితర సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆమె టీమిండియా దిగ్గజ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని వివాహం చేసుకున్నారు. వీరికి సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ ఇద్దరూ పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం సైఫ్ బాలీవుడ్‌లో బిజీ యాక్టర్‌గా గుర్తింపుతెచ్చుకున్నారు.

Whats_app_banner