OTT Best Movies: ఓటీటీలో బెస్ట్ 5 సినిమాలు.. 4 డిఫరెంట్ జోనర్.. ఎక్కడ చూడాలంటే?
OTT Trending Movies This Week: ప్రతివారం సరికొత్త కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అవుతూనే ఉంటాయి. వాటిలో బెస్ట్ మాత్రమే ట్రెండింగ్‌లో ఉంటాయి. అలా ఈ వారం వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ 5 ఓటీటీ సినిమాలు, వాటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో తెలుసుకుందాం.

This Weekend OTT Best Movies: ఎవ్రీ వీక్ సరికొత్తగా, క్రేజీ కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీలో దర్శనం ఇచ్చి ఊరిస్తుంటాయి. వాటిలో బెస్ట్ మాత్రమే ట్రెండింగ్‌లో ఉండి దూసుకుపోతుంటాయి. అలా ఈ వారం వీకెండ్‌కు మంచి టైమ్ పాస్ కోసం చూడాల్సిన బెస్ట్ 5 సినిమాలు ఉన్నాయి. వీటిలో నాలుగు డిఫరెంట్ జోనర్‌కు చెందినవి కావడం విశేషం. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో తెలుసుకుందాం.
భీమా ఓటీటీ
మ్యాచో హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ భీమా (Bhimaa OTT). మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఫుల్ లెంత్ మాస్ యాక్షన్ సినిమాగా పేరు తెచ్చుకుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌కు కాస్తా మైథాలజీ టచ్ ఇచ్చి డైరెక్టర్ ఏ హర్ష తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో టాప్ 1 ట్రెండింగ్ స్థానంలో దూసుకుపోతోంది.
మాస్ ప్రేక్షకులకు
భీమా సినిమా ఏప్రిల్ 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney Plus Hotstar) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం నెంబర్ వన్ ట్రెండింగ్‌లో అదరగొడుతూ హాట్‌స్టార్‌లో ది బెస్ట్ 1 సినిమాగా నిలిచింది. కాగా ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్‌గా చేశారు. మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఎంపిక.
సైరన్ ఓటీటీ
తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా సైరన్. కీర్తి సురేష్, జయం రవి, అనుపమ పరమేశ్వరన్ ముగ్గురు పాపులర్ సెలబ్రిటీలు నటించిన ఈ మూవీకి తీవ్ర స్థాయిలో బజ్ ఏర్పడింది. క్రైమ్, రివేంజ్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ముందు తమిళనాడులో విడుదలైంది. ఆ తర్వాత తెలుగులో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ కుదర్లేదు.
సస్పెన్స్ థ్రిల్లర్
దాంతో సైరన్ సినిమాను నేరుగా తమిళంతోపాటు తెలుగు ఇతర భాషల్లో ఓటీటీలోకి వదిలారు. ప్రస్తుతం సైరన్ సినిమా (Siren OTT) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవడమే కాకుండా టాప్ 2 ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. దీంతో ఇది బెస్ట్ 2 సినిమాగా నిలిచింది. రివేంజ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి సైరన్ బెస్ట్ ఆప్షన్.
సేవ్ ది టైగర్స్ ఓటీటీ
ఓటీటీలో మంచి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌గా పేరు తెచ్చుకుంది సేవ్ ది టైగర్స్. కామెడీ జోనర్‌లో గతేడాది విడుదలైన ఈ సిరీస్ మంచి ఆదరణ పొందింది. దాంతో ఇటీవలే రెండో సీజన్‌ను కూడా స్ట్రీమింగ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సేవ్ ది టైగర్స్ 2 సీజన్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
అయితే, వాటిలో సేవ్ ది టైగర్స్ సీజన్ 1 (Save The Tigers OTT) టాప్ 3 ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. దీంతో హాట్‌స్టార్‌లో బెస్ట్ 3గా ఈ కామెడీ సిరీస్ నిలిచింది. ఈ సిరీస్‌లో అభినవ్ గోమఠం, ప్రియదర్శి, చైతన్య, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాత, దేవయాని శర్మ కీలక పాత్రలు పోషించారు. జబర్దస్త్ రోహిణి తన కామెడీ టైమింగ్‌తో బాగా అలరించింది.
కిడ్స్ కోసం స్పెషల్‌గా
వీటితోపాటు కిడ్స్ కోసం స్పెషల్‌గా స్ట్రీమింగ్ అవుతున్న కార్టూన్ సిరీస్‌లు డొరెమాన్ (Doraemon) (తెలుగు వెర్షన్), షిన్ చాన్ (Shin Chan) (హిందీ వెర్షన్) వరుసగా బెస్ట్ 4, 5 స్థానాల్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ప్రస్తుతం డొరెమాన్ 18వ సీజన్, షిన్ చాన్ 15వ సీజన్ ట్రెండ్ అవుతున్నాయి. ఇలా బెస్ట్ ఐదింటిలో నాలుగు డిఫరెంట్ జోనర్లు గల సినిమాలు, సిరీసులు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అలరిస్తున్నాయి.
టాపిక్