Major in Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డులు తిరగరాస్తున్న మేజర్‌-major movie creating new records in netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Major In Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డులు తిరగరాస్తున్న మేజర్‌

Major in Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డులు తిరగరాస్తున్న మేజర్‌

HT Telugu Desk HT Telugu
Jul 15, 2022 05:19 PM IST

Major in Netflix: మేజర్‌ మూవీ బాక్సాఫీస్‌ దగ్గరే కాదు నెట్‌ఫ్లిక్స్‌లోనూ సంచలనాలు సృష్టిస్తోంది. ఈ గ్లోబల్‌ ఓటీటీలో రికార్డులు తిరగ రాస్తోంది.

<p>మేజర్ మూవీలో అడివి శేష్</p>
మేజర్ మూవీలో అడివి శేష్ (Twitter)

2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ మేజర్‌. అడివి శేష్‌ ఈ మూవీలో మేజర్‌ సందీప్‌ పాత్ర పోషించాడు. శశికిరణ్‌ తిక్కా దీనికి డైరెక్టర్‌. ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్‌లోనూ రిలీజైంది. అయితే అక్కడ కూడా మేజర్‌ దూకుడు కొనసాగుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌లో నాన్‌ ఇంగ్లిష్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ప్రపంచవ్యాప్తంగా టాప్‌ 10లో ఈ మేజర్‌ మూవీ ఉంది. ఇక దక్షిణాసియాలో అన్ని భాషల్లోనూ ఈ సినిమా నంబర్‌ 1లో కొనసాగుతోంది. ఇక 14 దేశాల్లో టాప్‌ 10లో ఒకటిగా ఉంది అని ఇండస్ట్రీ ట్రాకర్‌ రమేష్‌ బాలా తన ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. మేజర్‌ హిందీ వెర్షన్‌ 14 దేశాల్లో టాప్‌ 10లో ఒకటిగా ఉండటం విశేషం.

మేజర్‌ మూవీకి మొదటి నుంచీ పాజిటివ్‌ రివ్యూలు వస్తున్నాయి. ఈ సినిమాలో మేజర్‌ సందీప్‌ పాత్ర పోషించిన అడివి శేష్‌ నటనకూ మంచి మార్కులు పడ్డాయి. దీంతో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన తర్వాత ఈ సినిమాను చూస్తున్న వాళ్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. అటు మేజర్‌ మేకర్స్‌ కూడా నాన్‌ ఇంగ్లిష్‌ ఫిల్మ్‌ కేటగిరీలో నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌ 10లో ఉన్నట్లు వెల్లడించారు.

మేజర్‌ మూవీని సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్‌, మహేష్‌ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ+ఎస్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో అడివి శేష్‌తోపాటు శోభితా ధూలిపాళ్ల, ప్రకాశ్‌ రాజ్‌, మురళీ శర్మ కూడా నటించారు.

Whats_app_banner